- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CCI: ఏషియన్ పెయింట్స్‌పై దర్యాప్తుకు సీసీఐ ఆదేశాలు
కొత్త కంపెనీల ఎంట్రీని, వృద్ధిని అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని బిర్లా కంపెనీ ఆరోపించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ పెయింట్ వ్యాపారంలో కొత్త వివాదం నెలకొంది. దశాబ్దాలుగా భారత పెయింట్ వ్యాపారంపై ఆధిపత్యం చెలాయిస్తున్న ఏషియన్ పెయింట్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. పెయింట్ల తయారీ, అమ్మకాల విషయంలో ఏషియన్ పెయింట్స్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై తాజాగా భారత కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) మంగళవారం దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్(బిర్లా పెయింట్స్ విభాగం) దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా సీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బిర్లా కంపెనీ పెయింట్స్ వ్యాపారంలో ఇటీవలే అడుగుపెట్టింది. అయితే, ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్న ఏషియన్ పెయింట్స్ కొత్త కంపెనీల ఎంట్రీని, వృద్ధిని అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని బిర్లా కంపెనీ ఆరోపించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి 90 రోజుల వ్యవధిలో నివేదికను సమర్పించాలని ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్‌ను సీసీఐ ఆదేశించింది.
ఆదిత్య బిర్లా గ్రూప్‌లో భాగమైన గ్రాసిమ్, గత సంవత్సరం ఫిబ్రవరిలో 'బిర్లా ఓపస్ పెయింట్స్' బ్రాండ్ కింద డెకరేటివ్ పెయింట్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. అయితే, ఈ వ్యాపారంలో ఆధిపత్యం కలిగిన ఏషియన్ పెయింట్స్ తన డీలర్లు పోటీ కంపెనీలతో సంప్రదించేందుకు, చర్చించడానికి అనుమతివ్వకుండా అడ్డుకుంటోంది. పరోక్షంగా డీలర్లపై ఒత్తిడి తెచ్చి ఇతర కంపెనీలకు సహకరించకుండా నిలువరిస్తోందని, ఇది నిబంధనలకు విరుద్ధమని గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా ముడి పదార్థాల సరఫరాదారులు పోటీ కంపెనీలకు వస్తువులు, సేవలు అందించకుండా చేస్తోంది. అలాగే భూమి యజమానులు, సరుకుల సరఫరాలో కీలకమైన సీఅండ్ఎఫ్ ఏజెంట్లు, రవాణా విభాగంలోని వారు ఇతర కంపెనీలకు సహకరించకుండా ఏషియన్ పెయింట్స్ చేస్తోందని వెల్లడించింది.






