Canara Bank: భారం కానున్న కెనరా బ్యాంక్ రుణాలు

by S Gopi |

రెండు నుంచి మూడేళ్ల కాలానికి సంబంధించి రుణాల రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచాలని నిర్ణయించినట్టు బ్యాంకు తెలిపింది.

Canara Bank: భారం కానున్న కెనరా బ్యాంక్ రుణాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్స్(ఎంసీఎల్ఆర్)ను పెంచుతున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా రెండు నుంచి మూడేళ్ల కాలానికి సంబంధించి రుణాల రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచాలని నిర్ణయించినట్టు బ్యాంకు తెలిపింది. బ్యాంకు స్టాక్ ఎక్స్ఛేంజీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్న దాని ప్రకారం, 2 ఏళ్ల ఎంసీఎల్ఆర్‌ను గురువారం నుంచి 8.95 శాతానికి సవరించింది. గతంలో ఇది 8.85 శాతంగా ఉండేది. అలాగే, మూడేళ్ల కాలానికి సంబంధించి ఎంసీఎల్ఆర్‌ను 8.90 శాతం నుంచి 9 శాతానికి పెంచినట్టు వెల్లడించింది. బ్యాంకు రుణాల పోర్ట్‌ఫోలియోలో దాదాపు సగం రుణాలు ఎంసీఎల్ఆర్‌తో అనుసంధానం చేశారు. దీనివల్ల కస్టమర్లు తీసుకునే వాహన, వ్యక్తిగత, గృహ వంటి రిటైల్ రుణాలపై ప్రభావం ఉంటుంది. కాగా, గతేడాది డిసెంబర్ నాటికి కెనరా బ్యాంక్ రుణ పోర్ట్‌ఫోలియో రూ. 11.92 లక్షల కోట్లుగా ఉంది.

Next Story