Loans: రుణాల రేట్లు తగ్గించిన కెనరా, ఇండియన్ బ్యాంకులు

by S Gopi |

ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంకులు ఆర్ఎల్ఎల్ఆర్ 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు గురువారం ప్రకటించాయి.

Loans: రుణాల రేట్లు తగ్గించిన కెనరా, ఇండియన్ బ్యాంకులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఇటీవలి ఎంపీసీ సమావేశంలో కీలక రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. ఈ నిర్ణయాన్ని అనుసరిస్తూ ఇప్పటికే బ్యాంకులు రుణాల రేట్లను తగ్గించాయి. తాజాగా ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంకులు సైతం రెపో-లింక్డ్ లెండింగ్ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్) 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు గురువారం ప్రకటించాయి. ఈ నిర్ణయం తర్వాత ఇండియన్ బ్యాంక్ ఇళ్ల రుణాలపై వడ్డీ రేటు ప్రస్తుతం ఉన్న 8.15 శాతం నుంచి 7.90 శాతానికి, వాహనాలపై వడ్డీ 8.50 శాతం నుంచి 8.25 శాతానికి దిగిరానుంది. దీంతో పాటు ఇండియన్ బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జీల్లో రాయితీ వంటి ప్రయోజనాలను కూడా ప్రకటించింది. ఇక, కెనరా బ్యాంకు సైతం ఆర్ఎల్ఎల్ఆర్ తగ్గించడంతో ఇళ్ల రుణాలు 7.90 శాతం నుంచి ప్రారంభమవుతాయి. వాహన రుణాలపై వార్షిక వడ్డీ 8.20 శాతం నుంచి ప్రారంభమవుతుందని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

Next Story