Health Insurance Policy: రూ.500కే ఆరోగ్యబీమా? ఈ పాలసీపై ఓ లుక్కేయండి!

by Vennela |

Health Insurance Policy: ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం.

Health Insurance Policy: రూ.500కే ఆరోగ్యబీమా? ఈ పాలసీపై ఓ లుక్కేయండి!
X

దిశ, వెబ్ డెస్క్: Health Insurance Policy: ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అది ఎప్పుడు ఎలా అవసరం అవుతుందో తెలియదు. అందుకే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. అయితే ఈ పాలసీ కోసం భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ ప్రీమియంతో కొన్ని కంపెనీలు రూ లక్షల కవరేజీని ఇస్తున్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.

వైద్యం కోసం ఆస్తులు అమ్మాల్సిన రోజుల్లో మనం ఉన్నాం. వైద్యం చాలా ఖరీదుగా మారింది. చిన్న ఆరోగ్య సమస్య అని ఆసుపత్రికి వెళ్తే రూ. లక్షలు ఖర్చు పెట్టిన వాళ్లు చాలా మందే ఉన్నారు. వైద్య ఖర్చుల వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పుడు వచ్చే రోగాలు కూడా చాలా భయంకరంగా ఉంటున్నాయి. నీరసంగా ఉందని ఆసుపత్రికి వెళ్తే బీపీ డౌన్ అయిపోయి ప్రాణాలు కోల్పోతున్నవారు కూడా చాలా మందే ఉన్నారు. అందుకే అందరూ ఆరోగ్య బీమా తీసుకోవాలి. ఈ బీమా సౌకర్యం పలు కంపెనీలు పలు రకాల మోడల్స్ లో అందిస్తున్నాయి. అయితే చాలా మంది నుంచి వచ్చే ఫిర్యాదులు ఏంటంటే..అధిక ప్రీమియంలు చెల్లించినా అవసరమైన ప్రయోజనాలు లభించడం లేదని..హెల్త్ బీమా కార్డు ఉన్నప్పటికీ కొన్ని ఆసుపత్రుల్లో చేరితే పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు సరైన పాలసీని ఎంచుకోవడం ముఖ్యం. చాలా కంపెనీలు తక్కువ ప్రీమియంకే లక్షల కవరేజీ ఇచ్చే హెల్త్ పాలసీలు ఇప్పుడు ఇస్తున్నాయి. రాయల్ సుందరం, యూనివర్సల్, రహేజా వంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు నెలకు రూ. 500 కంటే తక్కువకు ప్రీమియం కట్టించుకుంటూ మెరుగైన వైద్యం అందించే ఆసుపత్రులతో పనిచేస్తున్నాయి. కేర్, నివా, స్టార్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఐసీఐసీఐ, బజాజ్, మణిపాల్, కోటక్ వంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు నెలకు రూ. 1000 కంటే తక్కువ ప్రీమియంతో రూ. 5లక్షల నుంచి రూ. 1కోట్ల వరకు కవరేజీని అందిస్తున్నాయి. అదేవిధంగా హెచ్డీఎఫ్సీ, టాటా, జునో, వంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు రూ. 1000పైన మంత్రీ ఇన్ స్టాల్ మెంట్ కట్టించుకుంటూ ఎక్కువ హాస్పిటల్స్ లో ట్రీమ్మెంట్ అందేలా చూస్తున్నాయి.

మీరు ఏ కంపెనీ పాలసీని తీసుకున్నా ముఖ్యంగా చెక్ చేయాల్సిన విషయం ఏంటంటే..మీ దగ్గరలో ఉన్న నగరాలు,పట్టణాల్లో ఏఏ ఆసుపత్రిలో మీరు తీసుకోబోయే హెల్త్ కార్డ్ పనిచేస్తుందో తెలుసుకోవాలి. ట్రీట్మెంట్ అందే విషయంలోనూ ఆసుపత్రి ఎలా వ్యవహరిస్తున్నాయి..ఏఏ వ్యాధులకు చికిత్స చేస్తారు.మీకు దగ్గరలో ఎక్కడ మెరుగైన వైద్యం అందుతుందనే విషయాలను పరిగణలోనికి తీసుకుని మీ బడ్జెట్ కు తగ్గట్లుగా పాలసీ తీసుకోవాలి.

Next Story