- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Semiconductor: కొత్త హెచ్‌సీఎల్-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ ప్లాంట్‌కు కేబినెట్ ఆమోదం
ఈ జాయింట్ వెంచర్ ద్వారా దేశంలో 6వ సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటు కానుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో రూ.3,706 కోట్లతో హెచ్‌సీఎల్-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హెచ్‌సీఎల్-ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్‌గా ఏర్పాటవుతున్న ఈ ప్లాంట్ సెమీకండక్టర్ రంగంలో మరో కీలకమైన మైలురాయి అవనుంది. దీన్ని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా దేశంలో 6వ సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఐదు అధునాతన ఐదు సెమీకండక్టర్ల ప్లాంట్లు తయారీ దశలో ఉన్నాయి. హెచ్‌సీఎల్-ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ ప్లాంట్‌లో తయారయ్యే చిప్‌లను దేశీయ వినియోగానికి సరఫరా చేయడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా ప్రపంచ సెమీకండక్టర్ సరఫరాలోనూ కీలక పాత్ర పోషించేందుకు వీలవుతుంది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాంతంలో ఏర్పాటవుతున్న ఈ ప్లాంటులో మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఆటోమొబైల్స్, పర్సనల్ కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల విజువల్ డిస్‌ప్లేలలో ఉపయోగించే డిస్‌ప్లే డ్రైవర్ చిప్‌లను ఉత్పత్తి చేస్తారు. ఇది నెలకు 20,000 వేఫర్‌ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉందని, నెలకు 3.6 కోట్ల యూనిట్ల వరకు ఉత్పత్తి జరుగుతుందని భావిస్తున్నారు. హెచ్‌సీఎల్‌కు ఉన్న దశాబ్దాల హార్డ్‌వేర్ అనుభవం, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో ఒకటైన ఫాక్స్‌కాన్‌కు ఉన్న టెక్నాలజీ, గ్లోబల్ స్థాయి అనుభవం ద్వారా ఈ ప్లాంటులో సెమీకండక్టర్ల తయారీ కీలకంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.






