- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Byju's: గూగుల్‌ప్లే స్టోర్ నుంచి బైజూస్ యాప్ తొలగింపు
బైజూస్ బ్రాండ్ కింద పనిచేస్తున్న థింక్ అండ్ లెర్న్, మరికొన్ని ఇతర యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్‌లో కొనసాగుతున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్‌కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. తాజాగా అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు బకాయిలు చెల్లించకపోవడంతో గూగుల్ ప్లేస్టోర్ నుంచి బైజూస్ యాప్‌ను తొలగించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే, బైజూస్ బ్రాండ్ కింద పనిచేస్తున్న థింక్ అండ్ లెర్న్, మరికొన్ని ఇతర యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్‌లో కొనసాగుతున్నాయి. బైజూస్ యాప్‌కు మద్దతిస్తున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు చెల్లించాల్సిన బకాయిలు ఉండటంతో లెర్నింగ్ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించారు. ప్రస్తుతం బైజూస్ సంస్థ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రొఫెషనల్ నిర్వహణలో ఉండటంతో, చెల్లింపు సంబంధిత సమస్యలు ఏర్పడ్డాయి. అయితే, ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉండనుంది. బైజూస్ యాప్ ప్రస్తుతం 4–12 తరగతులకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, అలాగే 6–8 తరగతులకు సాంఘీక శాస్త్ర సబ్జెక్టులను బోధిస్తుంది. ఈ యాప్ జేఈఈ, నీట్, ఐఏఎస్ లాంటి పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ సపోర్ట్ కూడా అందిస్తుంది. బైజూస్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినప్పటికీ బైజూస్ ప్రీమియం లీనింగ్ యాప్, బైజూస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్ అందుబాటులో ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులో ఉన్న బైజూస్ సంస్థపై వివిధ పెట్టుబడిదారుల అప్పీల్ కారణంగా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ దివాలా ప్రక్రియను ప్రారంభించింది.






