- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sim Card: రోడ్డు పక్కన సిమ్ కార్డులు కొంటున్నారా.. జైలు పాలయ్యే చాన్స్.. మీ పేరిట ఉన్న సిమ్ కార్డులను ఇలా డిఆక్టివేట్ చేసుకోండి !
Sim Card: రోడ్ల పక్కన టెంట్ వేసి చాలామంది సిమ్ కార్డులు అమ్ముతూ ఉంటారు.

దిశ, వెబ్ డెస్క్: Sim Card: రోడ్ల పక్కన టెంట్ వేసి చాలామంది సిమ్ కార్డులు అమ్ముతూ ఉంటారు. అలాంటి సిమ్ కార్డులు మీరు కొంటున్నారా.. అయితే జాగ్రత్త మీరు ఏకంగా జైలు పాలు అయ్యే అవకాశం ఉంది. ఏంటి సిమ్ కార్డు కొంటే జైలు పాలు అవుతామా ఎలా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది నిజం ఎందుకంటే రోడ్డు పక్కన కొంతమంది టెంట్ వేసుకొని సిమ్ కార్డులు అమ్ముతూ ఉంటారు. అలాంటి వారి వద్ద మీరు సిమ్ కార్డులు కొన్నట్లయితే ఇబ్బందులు పాలు అయ్యే అవకాశం ఉంటుంది.
ఎలా అంటే మీరు సిమ్ కార్డు కోసం మీ ఆధార్ కార్డు అదే విధంగా మీ బయోమెట్రిక్ కోసం ఫింగర్ ప్రింట్ ఇస్తుంటారు. కానీ మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ అలాగే బయోమెట్రిక్ డీటెయిల్స్, ఈ రోడ్డు పక్కన సిమ్ కార్డులు విక్రయించేవారు థర్డ్ పార్టీలకు విక్రయించే అవకాశం ఉంటుంది. ఒకవేళ వారు అలా విక్రయించినట్లయితే మీ వివరాలతో మరికొన్ని సిమ్ కార్డులు కొంతమంది ఆగంతకులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సిమ్ కార్డులో మీ పేరిట జారీ అయి ఉంటాయి. ఈ సిమ్ కార్డులను ఉపయోగించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు మీ సిమ్ కార్డును ఉపయోగించి కిడ్నాపింగ్స్, బెదిరింపులకు పాల్పడవచ్చు. లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు కూడా మీ సిమ్ కార్డులను ఉపయోగించే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో పోలీసులు కేసు విచారణ మొదలు పెట్టినప్పుడు సిమ్ కార్డు ఎవరి పేరిట ఉందని చెక్ చేస్తారు. అప్పుడు మీ పేరిట కనుక సిమ్ కార్డు ఉన్నట్లయితే మీ పైన కేసు నమోదు అవకాశం ఉంటుంది.
కనుక రోడ్డు పక్కన సిమ్ కార్డులు తీసుకునేటప్పుడు కచ్చితంగా మీ పేరు, వివరాలు ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇచ్చేముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వీలైతే మీ పేరిట ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తయారుచేసిన https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/ ఈ వెబ్ సైట్లో మీ పేరిట ఎన్ని సిమ్ కార్డులు జారీ అయి ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీకు తెలియకుండా మీ పేరిట ఎవరైనా సిమ్ కార్డు తీసుకొని ఉంటే దానిని డియాక్టివేట్ చేసుకోవచ్చు..






