రంకెలేస్తున్న బుల్.. భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-18 04:44:52  IST  )

భారతీయ స్టాక్ మార్కెట్ బుల్ రంకెలేస్తోంది.

రంకెలేస్తున్న బుల్.. భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ స్టాక్ మార్కెట్ ‘బుల్’ రంకెలేస్తోంది. ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ సవరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేళ దీపావళి నాటికి GST భారాన్ని తగ్గిస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం మార్కెట్‌లో కొత్త ఊపును తెచ్చింది. ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్‌ ఏకంగా 1,088 పాయింట్ల లాభంతో 81,686 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 374 పాయింట్ల లాభంతో 25,005 వద్ద ట్రేడ్ అవుతోంది.

వ్యక్తిగత స్టాక్‌లలో ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫీడ్, ఎసీ, ఇతర వినియోగ వస్తువుల స్టాక్‌లు విపరీతంగా పెరుగుతున్నాయి. మారుతి సుజుకి దాదాపు 4 సంవత్సరాల్లో అత్యధిక పెరుగుదలను సాధించింది. ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్, క్యాంపస్ యాక్టివ్‌ వేర్, జాగిల్ ప్రీపెయిడ్ ఓషియన్ సర్వీసెస్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా, హీరో మోటో కార్ప్, హ్యుందాయ్ మోటార్స్, న్యూ ఇండియా అస్యురెన్స్ కంపెనీ, మారుతీ సుజూకీ ఇండియా, గాబ్రియల్ ఇండియా షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. అదేవిధంగా డొమెస్టిక్ గ్లోబల్ సర్వీసెస్, గాడ్ఫ్రీ ఫిలిప్స్ ఇండియా, కావేరీ సీడ్ కంపెనీ, ఎతోస్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచుస్తున్నాయి.

Next Story