- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Budget-2025: రూ. 5.7 లక్షలకు ఆదాయపు పన్ను మినహాయింపు పెంచాలి: జీటీఆర్ఐ

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమర్పించేందుకు మరికొన్ని రోజులే మిగిలుంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే సామాన్యులు ఎన్నో అంచనాలతో తమకోసం ప్రకటనలు ఉంటాయని ఆశిస్తున్నారు. దీనికి మద్దతిస్తూ ప్రముఖ థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ద్రవ్యోల్బణంతో సమానంగా బడ్జెట్‌లో ఆదాయాపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 5.7 లక్షలకు పెంచాలని తెలిపింది. అలాగే, టీడీఎస్ వ్యవస్థను సరళీకృతం చేయాలని, బ్యాంకు డిపాజిట్లు, ఈక్విటీలపై పన్నులను సమం చేసే చర్యలు తీసుకోవాలని పేర్కొంది. 2014 నుంచి ఒక వ్యక్తి ఆదాయ పన్ను మినహాయింపు రూ. 2.5 లక్షల వద్దే ఉందని, వార్షిక సగటు ద్రవ్యోల్బణ రేటు 5.7 శాతానికి దీన్ని సర్దుబాటు చేయాలని అభిప్రాయపడింది. ఎందుకంటే 2014లో రూ. 2.5 లక్షల విలువ నేడు రూ. 1.4 లక్షలకు సమానమని వివరించింది. వాస్తవ విలువను కొనసాగించేందుకు పాత పన్నుల విధానంలో వ్యక్తిగత పన్ను మినహాయింపు రూ. 5.7 లక్షలు ఉండాలి.