Union Budget 2025: ఆదాయపు పన్ను తగ్గిస్తారా? హౌసింగ్ లోన్ సంగతి ఏంటి? బడ్జెట్ నుంచి మిడిల్ క్లాస్ ఏం కోరుకుంటోంది?

by Vennela |

Union Budget 2025: ఈ బడ్జెట్లో(Budget 2025) కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Union Budget 2025: ఆదాయపు పన్ను తగ్గిస్తారా? హౌసింగ్ లోన్ సంగతి ఏంటి? బడ్జెట్ నుంచి మిడిల్ క్లాస్ ఏం కోరుకుంటోంది?
X

దిశ, వెబ్‌డెస్క్: Union Budget 2025: ఈ బడ్జెట్లో(Budget 2025) కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైటర్స్ వార్తా సంస్థ నివేదిక ప్రకారం ఫిబ్రవరి బడ్జెట్లో వార్షిక ఆదాయం రూ. 15 లక్షల వరకు పన్ను రేటు తగ్గించవచ్చు అని చెప్తున్నారు.

కేంద్ర బడ్జెట్ 2025(Budget 2025) సమీపిస్తున్న తరుణంలో సామాన్యులకు ఆదాయపన్ను విధానాల్లో సాధ్యమయ్యే మార్పులపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. నిపుణులు వ్యక్తిగత ఆదాయపు పన్ను, గృహ ప్రయోజనాలు, ఈవీలు, క్రిప్టో, పొదుపు ప్రోత్సాహాలు, ఇతర రంగాల్లో మార్పులను సూచించారు. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడమే ఈ ప్రతిపాదిత సంస్కరణ లక్ష్యం.

ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు: మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేందుకు ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ద్రుష్టిలో ఉంచుకుని ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 4లక్షలకు పెంచాలి. అయితే చాలా మంది పన్ను చెల్లింపు దారులు రూ. 10లక్షల వరకు లిమిట్ ఆశిస్తున్నట్లు ట్యాక్స్ 2 విన్ సీఈవో అభిషేక్ సోని తెలిపారు. ప్రభుత్వం ఏడాదికి రూ. 15లక్షలు సంపాదించే వ్యక్తులకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలి. ఇది పునర్వినియోగపరిచలేని ఆదాయన్ని పెంచుతుంది. అలాగే వినియోగాన్ని మెరుగుపరుస్తుందని క్లియర్ టాక్స్ లోని పన్ను నిపుణులు షెఫాలీ ముంద్రా తెలిపారు.

గృహ రుణాలపై కొత్త పన్ను విధానంలో ప్రయోజనాలు: పాత పన్ను విధానం కంటే తక్కువగా ఉన్నప్పటికీ కొత్త పన్ను విధానంలో ప్రయోజనాలను అందించడం ద్వారా ఆర్థిక మంత్రి సీతారామన్ ఇంటి యాజమాన్యాన్ని ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

గృహ రుణంపై వడ్డీ మినహాయింపు పరిమితిని పెంచడం: దేవాన్ పీఎన్ చోప్రా అండ్ కో. మేనేజింగ్ పార్టనర్ ధ్రువ్ చోప్రా మాట్లాడుతూ సెక్షన్ 24బి కింద హౌసింగ్ లోన్ పై వడ్డీ మినహాయింపు పరిమితిని రూ. 2లక్షల నుంచి 3 లక్షల వరకు పెంచాలన్నారు. కనీసం ఒక ఇంటికి చెల్లించే మొత్తం వడ్డీపై మినహాయింపును అనుమతించాలని కోరారు.

NPS తగ్గింపు పరిమితిని పెంచడం:ఎన్పీఎస్ అదనపు మినహాయింపు లిమిట్ ను రూ. 50, 000నుంచి రూ. 1,00,000కి పెంచాలని ఎన్పీఎస్ నుంచి ఉపసంహరణలను పూర్తిగా పన్ను రహితంగా చేయాలని అభిషేక్ సోనీ సూచించారు.

సెక్షన్ 80C కింద పరిమితిని పెంచడం: 2014 నుంచి రూ. 1.50లక్షల వరకు స్తంభింపచేసిన సెక్షన్ 80సీ పరిమితిని పెంచాలంటూ సూచించారు. పీపీఎఫ్, పన్ను ఆదా చేసే ఎఫ్డీ వంటి ఆర్థిక సాధనాల్లో పెట్టుబడిని ప్రోత్సహించడానికి దీనిని రూ. 2.50లక్షలకు పెంచాలని కోరుతున్నారు.

సీనియర్ సిటిజన్లకు అధిక మినహాయింపు పరిమితి: సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని తద్వారా వారి ఆర్ధిక ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంటుందని అభిషేక్ సోనీ తెలిపారు.

Next Story