Budget 2025: ఈ బడ్జెట్‎లో రైతులకు శుభవార్త?.. రూ. 5లక్షల రుణం.. కేంద్రం అదిరిపోయే బహుమతి

by Vennela |

KCC Scheme: దేశంలోని రైతులకు శుభవార్త అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Budget 2025: ఈ బడ్జెట్‎లో రైతులకు శుభవార్త?.. రూ. 5లక్షల రుణం.. కేంద్రం అదిరిపోయే బహుమతి
X

దిశ,వెబ్‌డెస్క్: KCC Scheme: దేశంలోని రైతులకు శుభవార్త అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి హామీ లేకుండానే రూ. 5లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు కేసీసీ(Kisan Credit Card Scheme) స్కీములో మార్పు చేయనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో దీనిపై ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రంలోని మోడీ(pm modi) ప్రభుత్వం ఇప్పటికే పలు స్కీములను అందుబాటులోకి తీసుకువచ్చి వాటిని అమలు చేస్తోంది. అందులో ప్రధానంగా కిసాన్ సమ్మాన్ నిధి యోజన(Kisan Samman Nidhi Yojana). ఈ స్కీము ద్వారా ప్రతి ఏడాది రూ. 6వేలు పెట్టుబడి సాయం కింద రైతులకు అందిస్తోంది. ఇక ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వంటివి ఇతర స్కీములు కూడా ఉన్నాయి అలాగే రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు లు కూడా అందిస్తోంది.

ఇప్పుడు ఈ స్కీమ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డు(Kisan Credit Card) ద్వారా ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ. 3లక్షల వరకు లోన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ లిమిట్ ను రూ. 5లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. ఫిబ్రవరి 1వ తేదీన వచ్చే ఆర్థిక ఏడాది 2025-26కు సంబంధించిన వార్షిక బడ్జెట్లో(Budget 2025)నే దీనిపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.

కిసాన్ క్రెడిట్ స్కీమ్(Kisan Credi Scheme) తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రధానమైన మార్పులు చేయలేదు. ఈ కార్డు తీసుకున్న రైతులకు పలు దఫాలుగా లోన్స్ ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న లిమిట్ రూ. 3లక్షల నుంచి రూ. 5లక్షల వరకు పెంచాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. గ్రామీణ డిమాండ్ పెంచేందుకు రైతులకు మద్దతుగా ఆర్థిక భరోసా ఇచ్చే స్కీమ్ లిమిట్ పెంచాలని వ్యవసాయ రంగ నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ డిమాండ్లు, సూచనలను పరిగణలోనికి తీసుకుని కేసీసీ లిమిట్ రూ. 5లక్షలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story