BSNL: అందుకే బీఎస్ఎన్ఎల్ బెస్ట్.. రూ.3లకే 365 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్

by Vennela |

BSNL: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మొబైల్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు అదిరిపోయే ప్లాన్స్ అందిస్తూ వస్తోంది.

BSNL: అందుకే బీఎస్ఎన్ఎల్ బెస్ట్.. రూ.3లకే 365 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్
X

దిశ, వెబ్‌డెస్క్: BSNL: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మొబైల్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు అదిరిపోయే ప్లాన్స్ అందిస్తూ వస్తోంది. ఇప్పుడు తమ మొబైల్ సర్వీసులు వాడుకునే యూజర్ల కోసం ఒక సూపర్ ఆఫర్ ను ప్రకటించింది. 365 రోజుల వ్యాలిడిటీ (365 Recharge validity)ఉండే ప్రీపెయిడ్ ప్లాన్ ను (Prepaid Plan)అతి తక్కువ ధరకే అందించేందుకు ప్లాన్ చేస్తోంది.

ఈ ప్లాన్ తీసుకుంటే యూజర్లు రోజుకు 3 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. 4జీ నెట్ వర్క్ వైపు వేగంగా అడుగులు వేస్తూన్న బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ సామాన్యులకు ఎంతో ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్ను ఈ అతి తక్కువ ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 1,198. ఈ ప్లాన్ చెల్లుబాటు 365రోజులు ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ను ఆ సంస్థ సిమ్ ను సెకండరీ నెంబర్ గా ఉపయోగించే యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ లో యూజర్లకు ప్రతినెలా రూ. 100 వరకు ఖర్చు అవుతుంది.

ఈ ప్లాన్ లో దేశవ్యాప్తంగా ఏ నెంబర్ కు అయినా కాల్ చేసేందుకు ప్రతినెలా 300 ఉచిత నిమిషాలు (300 minutes talk time) అందుబాటులో ఉంటాయి. అలాగే యూజర్లు ప్రతినెలా 3జీబీ హై స్పీడ్ 3జీ లేదా 4జీ డేటా ప్రయోజనాన్ని అందుకుంటారు. ఇక ప్రతినెలా 30 ఫ్రీ ఎస్ఎంఎస్ ల ప్రయోజనం కూడా పొందుతారు. ఫ్రీ నేషనల్ రోమింగ్ కూడా ఈ ప్లాన్ లో ఉంది. భారతదేశం అంతటా రోమింగ్ చేస్తున్నప్పుడు యూజర్లు ఫ్రీ ఇన్ కమింగ్ కాల్స్ ను అందుకోవచ్చు.

బీఎస్ఎన్ఎల్ (BSNL)నెట్ వర్క్ విస్తరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 6,000కోట్ల ప్రోత్సాహాన్ని అందించింది. బీఎస్ఎన్ఎల్(BSNL), ఎంటీఎన్ఎల్(MTNL) 4జీ సర్వీసులను అప్ గ్రేడ్ చేసేందుకు ఈ అదనపు బడ్జెట్ కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. త్వరలో ఈ రెండు టెలికాం కంపెనీల యూజర్లు పూర్తి స్థాయిలో 4జీ సర్వీసులను అందుకోనున్నారు.

Next Story