- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BSNL: దేశవ్యాప్తంగా 50,000 స్వదేశీ 4జీ టవర్లను ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువ స్వదేశీ 4జీ టవర్లను ఏర్పాటు చేసినట్టు కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. బుధవారం నాటికి బీఎస్ఎన్ఎల్ 50 వేలకు పైగా టవర్లను ఇన్‌స్టాల్ చేసింది. వాటిలో 41,000కు పైగా టవర్లు నిర్వహణలో ఉన్నాయి. 5,000 టవర్లు డిజిటల్ భారత్ నిధి ఫండ్ ద్వారా 4జీ ప్రాజెక్ట్ కింద ఏర్పాటయ్యాయి. ఇటీవల టెలికాం మంత్రి జ్యోతిరాధిత్య సింధియా బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్‌వర్క్ కోసం 2025, జూన్ నాటికి లక్షల టవర్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత నెలరోజుల్లో వాటిని 5జీకి మార్చనున్నట్టు చెప్పారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ 5జీ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్(రాన్), 3.6 గిగాహెర్ట్జ్, 700 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలో ట్రయల్స్‌ను పూర్తి చేసింది. బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్‌వర్క్ కోసం టాటా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియంకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. టాటా సంస్థ ఐటీ హార్డ్‌వేర్ సంస్థ తేజస్ నెట్‌వర్క్స్ సహా ప్రభుత్వ సంస్థలతో కలిసి బీఎస్ఎన్ఎల్‌కు సహకారం అందిస్తున్నాయి.