- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BSNL: బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా.. రూ. 1కే రోజుకు 2జీబీ డేటా
అంతేకాకుండా అందులోనే ఉచిత సిమ్ కూడా లభిస్తుందని సంస్థ తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దీపావళి సందర్భంగా అతి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. దీపావళి బొనాంజా ఆఫర్ కింద కేవలం రూ. 1కే అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు 30 రోజుల వ్యవధితో ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా అందులోనే ఉచిత సిమ్ కూడా లభిస్తుందని సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ కొత్త కస్టమర్లకు వర్తిస్తుందని, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, పండుగ సీజన్ సందర్భంగా కొత్త కస్టమర్ల కోసం ఈ ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చామని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. ముఖ్యంగా సంస్థకు పటిష్టమైన విశ్వాసం ఉన్న గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని వారికి అనువుగా ఉంటుందని ఈ ఆఫర్ అందిస్తున్నట్టు వివరించింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఈ ఆఫర్ పొందడానికి సమీసంలో ఉండే బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ) లేదా రిటైలర్లను సంప్రదించాలని సంస్థ వెల్లడించింది.






