కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్.. ఒకరి రీఛార్జ్‌తో ఫ్యామీలి మొత్తం బెనిఫిట్స్

by Yella Dhawani Reddy |

వినియోగదారులకు బీఎస్‌ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్.. ఒకరి రీఛార్జ్‌తో ఫ్యామీలి మొత్తం బెనిఫిట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ టెలికం రంగ సంస్థ BSNL వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లకు రీఛార్జింగ్ మొత్తం ఖర్చును తగ్గించటమే లక్ష్యంతో సరికొత్త వినూత్న ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో మొత్తం కుటుంబం అద్భుతమైన బెనిఫిట్స్‌ను పొందవచ్చు. ఒకే రీఛార్జ్‌తో ఏకంగా మూడు సిమ్‌లు కనెక్ట్ చేసుకునే ఈ ప్లాన్ వివరాలేంటో తెలుసుకుందాం.

BSNL రూ.798 రీఛార్జ్ ప్లాన్ :

BSNL కస్టమర్లు రూ.798 ధరతో పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ చేసుకుంటే.. అదనంగా రెండు సిమ్‌లు కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో ఒక కుటుంబంలో ముగ్గురు సభ్యులు విడివిడిగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక మూడు సిమ్‌ల వారు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్, 50GB డేటాను అందుకోవచ్చు. అలాగే, రోజుకు 100 ఉచిత SMS కూడా ఉన్నాయి. ఈ ఆకర్షణీయమైన ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ ద్వారా ప్రకటించింది. ఆసక్తిగల కస్టమర్లు వెంటనే రీఛార్జ్ చేసుకుని ఈ ఆఫర్‌ను పొందండి.

Next Story