- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BSNL: ఒక్క రూపాయితో రోజుకు 2జీబీ డేటా.. బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ఆఫర్
ఈ ఫ్రీడమ్ ఆఫర్‌ను పొందే వారికి ఎటువంటి ఖర్చు లేకుండా ఉచిత 4జీ సిమ్ కార్డ్ కూడా సంస్థ ఇవ్వనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సబ్‌స్క్రైబర్ల కోసం పరిమిత కాలానికి కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. 'ఫ్రీడమ్ ఆఫర్' కింద 'ఆజాది కా ప్లాన్' పేరుతో లాంచ్ చేసిన ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు కేవలం రూ. 1తో రోజుకు 2జీబీ 4జీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయని బీఎస్ఎన్ఎల్ సోషల్ మీడియాలో వెల్లడించింది. అయితే, ఈ ఆఫర్ కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఫ్రీడమ్ ఆఫర్‌ను పొందే వారికి ఎటువంటి ఖర్చు లేకుండా ఉచిత 4జీ సిమ్ కార్డ్ కూడా సంస్థ ఇవ్వనుంది. ఈ ఆఫర్ ఆగష్టు 1వ తేదీ నుంచి 31 వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్‌ను పొందడానికి, వినియోగదారులు రిటైలర్ లేదా బీఎస్ఎన్ఎల్ సర్వీసెస్ సెంటర్‌లను సంప్రదించవచ్చు. ఇటీవల బీఎస్ఎన్ఎల్ క్రమంగా సబ్‌స్క్రైబర్లను కోల్పోతోంది. ఈ నేపథ్యంలో తాజా ఆఫర్ ప్రకటించింది. ఇటీవలి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం, జూన్ నెలలో బీఎస్ఎన్ఎల్ 3 లక్షలకు పైగా కస్టమర్లను కోల్పోయింది.






