- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BSNL: 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ సేవల్లోకి అడుగుపెట్టిన బీఎస్ఎన్ఎల్
ఈ క్వాంటం 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ సేవలు భారతీయ ఇంజనీర్లు ప్రపంచ స్థాయి కనెక్టివిటీని ఎలా సృష్టించవచ్చో నిరూపిస్తాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ సేవలోకి అడుగుపెట్టిందని కంపెనీ శుక్రవారం తెలిపింది. ప్రస్తుతం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీలు మాత్రమే 5జీ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించి 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ సర్వీసులను అందిస్తున్నాయి. ఈ క్వాంటం 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ సేవలు భారతీయ ఇంజనీర్లు ప్రపంచ స్థాయి కనెక్టివిటీని ఎలా సృష్టించవచ్చో నిరూపిస్తాయి. పైగా ఇవి బీఎస్ఎన్ఎల్ కోసం మొట్టమొదటి సిమ్-రహిత, 100 శాతం స్వదేశీ అనుకూల 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ సేవలు. ప్రస్తుతం హైబదార్బాద్‌లో దీన్ని సాఫ్ట్ లాంచ్‌గానే ప్రారంభించామని, త్వరలో మరిన్ని నగరాలు, ఫీచర్ అప్‌గ్రేడ్‌లను అందుబాటులోకి తీసుకొస్తామని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏ రాబర్ట్ జె రవి అన్నారు. ఈ 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ సేవల కనెక్షన్ కోసం ఆప్టికల్ ఫైబర్ అవసరం లేదు. బీఎస్ఎన్ఎల్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2025 సెప్టెంబర్ నాటికి బెంగళూరు, పాండిచ్చేరి, విశాఖపట్నం, పూణే, గ్వాలియర్, చండీగఢ్‌లలో 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ సేవల పైలట్ ప్రాజెక్టును విస్తరిస్తుంది. ప్రారంభంలో సెకనుకు 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో రూ. 999 ప్లాన్, 300ఎంబీపీఎస్ వేగంతో రూ. 1,499 ప్లాన్‌లను అందించనుంది.






