- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BSNL Bumper Offer: యూజర్లకు హోలీ ఆఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్
ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కు యూజర్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కు యూజర్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎస్ఎల్ హోలీ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న రీచార్జ్ ప్లాన్‌కు సంబంధించి వ్యాలిడిటీని పొడగించింది. అయితే ఈ అవకాశం కేవలం మార్చి 30 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. మరీ ఈ ప్లాన్ వివరాలేంటో తెలుసుకుందాం.
బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.2399తో రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 30 రోజుల వ్యాలిడిటీని పెంచింది. గతంలో ఈ ప్లాన్ 395 రోజులు ఉండగా.. ప్రస్తుతం 425 రోజులకు పెరిగింది. ఇక ఈ ప్లాన్‌లో భారత్ అంతటా అన్‌లిమిటెడ్ వాయింగ్ కాలింగ్, ప్రతిరోజూ 2GB హై స్పీడ్ డేటా, 100 ఉచిత SMSలను పొందవచ్చు. వీటితో పాటు బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ బీటీవీ (BiTV) ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో కొన్ని OTT యాప్‌ల యాక్సెస్ సైతం లభించనుంది.
BSNL ఇతర ప్లాన్ వివరాలు..
*రూ. 1999 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 600GB డేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి.
*రూ.1499 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, 24GB డేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి.
*రూ.1198 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజుల వ్యాలిడిటీతో 300 నిమిషాల వాయిస్ కాల్స్, నెలకు 3GB డేటా, నెలకు 30 SMSలు లభిస్తాయి.
*రూ.997 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. 160 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 ఎSMSలు లభిస్తాయి.
*రూ. 897 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. 180 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 90GB డేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి.






