- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BSNL బంపర్ ఆఫర్.. 30 రోజులపాటు అన్ లిమిటెడ్.. ఉచితంగానే సిమ్!
కస్టమర్లకు బిఎస్ఎన్ఎల్ (BSNL) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా సిమ్ ఇవ్వడమే కాకుండా... నెల రోజుల పాటు.. అన్

దిశ, వెబ్ డెస్క్: కస్టమర్లకు బిఎస్ఎన్ఎల్ (BSNL) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా సిమ్ ఇవ్వడమే కాకుండా... నెల రోజుల పాటు.. అన్ లిమిటెడ్ ఆఫర్ కూడా పెట్టేసింది. మరో 15 రోజుల్లో ఇండిపెండెన్స్ డే ఉన్న సంగతి తెలిసిందే. అయితే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త ప్లాన్ తీసుకువచ్చింది భారత్ సంచార్ నిగం లిమిటెడ్. బిఎస్ఎన్ఎల్ ఆజాది కా ప్లాన్ (BSNL Azadi ka plan) పేరుతో ఈ ఆఫర్ తీసుకువచ్చింది.
ఈ ఆఫర్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే అని కూడా పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టింది బిఎస్ఎన్ఎల్. ఇక ఈ ప్లాన్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే... ఒకే ఒక్క రూపాయితో రీఛార్జి చేస్తే 30 రోజులపాటు అపరిమిత వాయిస్ కాల్స్ అందించనుంది కంపెనీ. అలాగే రోజుకు 100 మెసేజ్ లు కూడా పంపించుకోవచ్చు.
ప్రతి రోజు 2 జీబీ చొప్పున డేటా కూడా అందిస్తున్నారు. ఈ సిమ్ కూడా ఉచితంగానే అందిస్తున్నారు. ఆగస్టు ఒకటి అంటే ఇవాల్టి నుంచి 31వ తేదీ వరకు ఈ ఆఫర్ చెల్లుబాటులో ఉంటుందని కూడా కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్ కోసం సమీపంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కు వెళ్లాలని లేదా రిటైలర్ దగ్గరికి వెళ్ళవచ్చని పేర్కొంది.






