- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విరిగిన విద్యుత్ స్థంభం.. మూడు గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా..!
దిశ, బోథ్ : మండలంలోని కంటేగామ గ్రామ సమీపంలో శనివారం ఓ హార్వెస్టర్ విద్యుత్ స్తంభాన్ని డీ కొనడంతో స్తంభం విరిగిపోయి మూడు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, బోథ్ : మండలంలోని కంటేగామ గ్రామ సమీపంలో శనివారం ఓ హార్వెస్టర్ విద్యుత్ స్తంభాన్ని డీ కొనడంతో స్తంభం విరిగిపోయి మూడు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఓ వ్యవసాయ పొలం లో 11 కెవి విద్యుత్ స్తంభాన్ని ఓ హార్వెస్టర్ డీ కొనడం తో మారుమూల గ్రామలైన కంటేగామ, బాబేర, నిగిని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. విద్యుత్ అధికారులు మాట్లాడుతూ విరిగిపోయిన స్థంభం స్థానం లో నూతన విద్యుత్ స్థంభం వేస్తేనే మూడు గ్రామాలకు విద్యుత్ వస్తుందని అన్నారు. విరిగిపోయిన స్థంభం స్థానంలో నూతన విద్యుత్ స్థంభం ఏర్పాటు చేసి విద్యుత్ ను పునరుద్ధరిస్తామని తెలిపారు.
Next Story






