- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Muddyfox: భారత మార్కెట్లోకి బ్రిటిష్ సైకిల్ బ్రాండ్ మడ్డీఫాక్స్
భారతీయ కస్టమర్ల కొసం, వారి అవసరాలకు తగినట్లుగా ఉత్పత్తులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మడ్డీఫాక్స్ ఆసియా పసిఫిక్ రీజియన్ ఎండీ సాహిల్ మెహ్రోత్రా చెప్పారు

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ బ్రిటిష్ ఐకానిక్ బైక్ బ్రాండ్ మడ్డీఫాక్స్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీనికోసం స్థానిక డిస్ట్రిబ్యూటర్‌గా అనంత వెంచర్స్‌తో ఒప్పందం చేసుకున్నామని, ఇందులో భాగంగా 18 మోడళ్లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థలు ఒప్పందంపై సంతకాలు చేసినట్టు వెల్లడించాయి. యూరప్ మార్కెట్లో తమ సైకిళ్లకు మంచి ఆదరణ ఉందని, భారతీయ కస్టమర్ల కొసం, వారి అవసరాలకు తగినట్లుగా ఉత్పత్తులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మడ్డీఫాక్స్ ఆసియా పసిఫిక్ రీజియన్ ఎండీ సాహిల్ మెహ్రోత్రా చెప్పారు. అనంత వెంచర్స్‌తో భాగస్వామ్యం ద్వారా దేశంలో బలమైన మార్కెట్‌ను ఏర్పాటు కోసం కలిసి పని చేస్తాము. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో సైక్లింగ్ దుస్తులు, యాక్సెసరీస్‌తో పాటు మౌంటెయిన్, రోడ్, హైబ్రిడ్ బైక్‌లు ఉన్నాయి. ప్రస్తుతం మడ్డీఫాక్స్ 18 బైక్ మోడళ్లను విడుదల చేసింది. మొదటి దశలో వీటిని సెమీ-నాక్డ్ డౌన్‌గా దిగుమతి చేసుకున్నామని, అన్ని రకాల సైకిళ్లను అందుబాటులో ఉంచినట్టు కంపెనీ వివరించింది. అధిక నాణ్యత, ప్రీమియం బ్రాండ్ ఉత్పత్తులు, మెరుగైన రైడింగ్ అనుభూతి కోసం మడ్డీఫాక్స్ సైకిళ్లు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. కాగా, 1980ల మధ్యలో స్థాపించిన మడ్డీఫాక్స్, యూకే, యూరోపియన్ మార్కెట్లలో మౌంటెన్ బైకింగ్ సైకిళ్లను మార్కెట్లోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది.






