నాలుగు రోజుల పెరుగుదలకు బ్రేక్.. భారీగా పడిపోయిన బంగారం ధర

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌లో నాలుగు రోజుల వరుస పెరుగుదల తర్వాత బంగారం ధరలు పడిపోయాయి.

నాలుగు రోజుల పెరుగుదలకు బ్రేక్.. భారీగా పడిపోయిన బంగారం ధర
X

దిశ, వెబ్‌డెస్క్: నాలుగు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం (Gold) ధర ఒక్కసారిగా పడిపోయింది. అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌ (Hyderabad Bullion Market)లో ఇవాళ గోల్డ్ ధరలు భారీగా క్షీణించాయి. తులం బంగారంపై 2 వేల రూపాయలకు పైగా తగ్గడంతో కొనుగోలుదారులకు పెద్ద ఊరట లభించింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారంపై రూ.2,240 మేర తగ్గి రూ.1,60,090 వద్దకు చేరింది. అదేవిధంగా ఆభరణాల్లో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,050 తగ్గి ప్రస్తుతం మార్కెట్‌లో రూ.1,46,750 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,14,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ పెరగడం, పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి అంశాలు బంగారం, వెండి ధరల తగ్గుదలకు కారణమయ్యాయని బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

Next Story