Bread: పెరిగిన బ్రెడ్ ధరలు

by S Gopi |

ప్లాస్టిక్ ప్యాకేజింగ్, రవాణా కోసం ఉపయోగించే దిగుమతి చేసుకున్న ముడి పదార్థాల ఖర్చుల కారణంగా ధరలు పెరిగినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Bread: పెరిగిన బ్రెడ్ ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పాల ధరలు పెరిగిన కొద్ది రోజులకే ఇప్పుడు బ్రెడ్ ధరలు కూడా వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా బ్రెడ్ ధరలు ప్యాక్‌కు రూ. 5 పెరిగాయి. ప్లాస్టిక్ ప్యాకేజింగ్, రవాణా కోసం ఉపయోగించే దిగుమతి చేసుకున్న ముడి పదార్థాల ఖర్చుల కారణంగా ధరలు పెరిగినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భారత కరెన్సీ రూపాయి విలువ పడిపోవడం కూడా దిగుమతుల కష్టాలను మరింత పెంచుతోంది. ప్రముఖ మోడర్న్ బ్రెడ్ తన ప్రధాన బ్రెడ్ ఉత్పత్తులపై ఒక్కో ప్యాక్‌కు రూ.5 వరకు ధరలు పెంచింది. దీంతో 400 గ్రాముల శాండ్‌విచ్ బ్రెడ్ రూ.40 నుంచి రూ.45కు, హోల్ వీట్ బ్రెడ్ రూ.55 నుంచి రూ.60కు, మల్టీగ్రెయిన్ బ్రెడ్ రూ.60 నుంచి రూ.65కు చేరాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, బ్రిటానియా, విబ్స్ వంటి ఇతర కంపెనీలు కూడా త్వరలో ధరలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ప్లాస్టిక్ కవర్లు, ప్రిజర్వేటివ్స్, ఉప్పు, డీజిల్ వంటి అన్ని రకాల ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతున్నాయని బేకరీ వ్యాపారులు చెబుతున్నారు. కొందరు బేకర్లు ఇప్పటికే ధరలు పెంచగా, మరికొందరు త్వరలో పెంపు తప్పదని స్పష్టం చేశారు.

Next Story