- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SBI: ఆభరణాల పరిశ్రమలో గ్రే మార్కెట్ భయాలు
గతంలో అనేకసార్లు బంగారం దిగుమతులపై సుంకాన్ని పెంచే నిర్ణయం తీసుకున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి పెంచిన నిర్ణయం మార్కెట్‌లో కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. ముఖ్యంగా, ఈ నిర్ణయం వల్ల దేశీయంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో పాటు, గ్రే మార్కెట్(బిల్లులు లేకుండా అమ్మకాలు), స్మగ్లింగ్ కార్యకలాపాలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రీసెర్చ్ హెచ్చరించింది. గతంలో అనేకసార్లు బంగారం దిగుమతులపై సుంకాన్ని పెంచే నిర్ణయం తీసుకున్నారు. అయితే, సుంకం విధించడం వల్ల దిగుమతులు తగ్గినా, అక్రమ మార్గాల్లో బంగారం సరఫరా పెరిగిన ఉదాహరణలు ఉన్నాయని నివేదిక గుర్తు చేసింది.
దిగుమతి సుంకం పెరగడంతో అంతర్జాతీయ ధరలు, దేశీయ మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం మరింత పెరుగుతుంది. దీనివల్ల తక్కువ ధర ఉన్న విదేశీ మార్కెట్‌లో బంగారాన్ని కొని, ఎక్కువ ధర ఉన్న మన దేశీయ మార్కెట్‌లో అమ్మకాలు జరిగే ప్రమాదం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా దుబాయ్ వంటి మార్కెట్ల నుంచి అక్రమంగా బంగారం రవాణా చేసే నెట్‌వర్క్‌లు మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. ఫలితంగా ఈ పరిస్థితి అధికారిక మార్గంలో దిగుమతి చేసుకునే వ్యాపారులకు ఖర్చుల భారం పెరగడం, గ్రే మార్కెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశం ఉంది. మరోవైపు, బంగారం దిగుమతుల పరిమాణం తగ్గుతున్నప్పటికీ, అధిక అంతర్జాతీయ ధరల కారణంగా మొత్తం దిగుమతి బిల్లు మాత్రం పెరుగుతూనే ఉంది. దీంతో దేశ కరెంట్ అకౌంట్ లోటుపై కూడా ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది.






