- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SBI-BPCL: ఎస్‌బీఐతో రూ. 31 వేల కోట్ల విలువైన రుణ ఒప్పందం కుదుర్చుకున్న బీపీసీఎల్
ఎస్‌బీఐ నేతృత్వంలోని ఆరు బ్యాంకుల కన్సార్షియంతో రుణ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నట్టు బీపీసీఎల్ వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)తో ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థ బీపీసీఎల్ సంస్థ కీలక రుణ ఒప్పందం చేసుకుంది. ఎస్‌బీఐ నేతృత్వంలోని ఆరు బ్యాంకుల కన్సార్షియంతో బినా రిఫైనరీ, పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ కోసం రూ. 31,802 కోట్ల రుణ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నట్టు బీపీసీఎల్ శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతం చేసినట్టు తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని బినాలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్, రిఫైనరీ విస్తరణ అభివృద్ధి, నిర్వహణ కోసం ఈ రుణాలను వినియోగించనున్నారు. రూ. 48,926 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రిఫైనరీ సామర్థ్యం 78 లక్షల టన్నుల నుంచి 1.1 కోట్ల టన్నులకు పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. దీన్ని పూర్తి చేసేందుకు 4 ఏళ్ల గడువు నిర్దేశించిన కంపెనీ భవిష్యత్తులో మధ్య, ఉత్తర భారత ప్రాంతంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్ తీర్చగలదని బీపీసీఎల్ వెల్లడించింది.






