24 గంటలలో ఎప్పుడైనా ఇతర దేశాలకు మనీ ట్రాన్స్‌ఫర్

by Disha WebDesk |
24 గంటలలో ఎప్పుడైనా ఇతర దేశాలకు మనీ ట్రాన్స్‌ఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశపు సుప్రసిద్ధ ఆన్‌లైన్‌ విదేశీ మారకద్రవ్య మార్పిడి సేవల ప్రదాత, బుక్‌ మై ఫారెక్స్‌ డాట్‌ కామ్‌ (మేక్‌ మై ట్రిప్‌ గ్రూప్‌ కంపెనీ), 24గంటల రెమిటెన్స్‌ సేవలను తమ వినియోగదారులకు వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన అనుభవాలను అందించేందుకు ప్రారంభించింది. రెమిటెన్స్‌ ఆర్డర్లను బుక్‌మై ఫారెక్స్‌ వెబ్‌సైట్‌ మరియు యాప్‌పై బుక్‌ చేసుకోవచ్చు. వినియోగదారులు ఫారెక్స్‌ రేట్లను మూడు రోజుల వరకూ 'బుక్‌ నౌ, పే లేటర్‌' కింద లాక్‌ చేసుకోవచ్చు. వినియోగదారులకు పూర్తి చెల్లింపులు చేసుకునే అవకాశం ఉండటంతో పాటుగా 2% రిఫండబుల్‌ అడ్వాన్స్‌ను 'బుక్‌ నౌ మరియు పే లేటర్‌' అవకాశంతో రేట్లను లాక్‌ చేయవచ్చు. ఈ నూతన ఫీచర్‌ను బుక్‌ మై ఫారెక్స్‌ యొక్క ప్రస్తుత లో–కాస్ట్‌, పూర్తి ఆన్‌లైన్‌ మరియు పేపర్‌ రహిత సేవల ద్వారా నిర్మించవచ్చు.

ఈ ప్రారంభం గురించి సుదర్శన్‌ మొత్త్వానీ, ఫౌండర్‌ –సీఈవో, బుక్‌ మై ఫారెక్స్‌ డాట్‌ కామ్‌ మాట్లాడుతూ ''బుక్‌ మై ఫారెక్స్‌ వద్ద, మేమెప్పుడూ కూడా వినూత్నమైన పరిష్కారాలను మరియు సౌకర్యవంతమైన అనుభవాలను మా వినియోగదారులకు అందించడాన్ని లక్ష్యంగా చేసుకున్నాము. మా నూతన ఆవిష్కరణ, 24/7 మనీ ట్రాన్స్‌ఫర్స్‌, మా సాంకేతిక ఆవిష్కరణలకు మరియు మా వినియోగదారుల లక్ష్యిత విధానానికి అత్యుత్తమ ఉదాహరణ. బుక్‌ నౌ, పే లేటర్‌ సేవలు ప్రత్యేకంగా ప్రస్తుత కాలంలో అంటే అనిశ్చితి కరెన్సీ రేట్లు కలిగిన కాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నూతన ఫీచర్లు మా వినియోగదారులకు గరిష్ట విలువ, వేగవంతమైన సేవలు మరియు పూర్తి మనశ్శాంతిని అందించడంలో సహాయపడతాయి'' అని అన్నారు.

ఫారెక్స్‌ విభాగంలో ఆవిష్కరణల పరంగా అగ్రగామిగా బుక్‌ మై ఫారెక్స్‌ వెలుగొందుతుంది. నమ్మకమైన బ్యాంక్‌ భాగస్వామిగా ఆన్‌లైన్‌, పేపర్‌ రహిత నగదు బదిలీ సేవలను సంస్థ అందిస్తోంది. ఈ నూతన ఫీచర్లతో, బుక్‌ మై ఫారెక్స్‌ ఇప్పుడు విదేశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను ఆకర్షించగలమని భావిస్తోంది. వీరి తల్లిదండ్రులు ఇప్పటికీ సమయం బ్యాంక్‌ శాఖల వద్ద అధికంగా తీసుకునే నగదు బదిలీ ప్రక్రియలపై ఆధారపడుతున్నారు. అక్కడ వారు అత్యధిక మొత్తాలలో విదేశీ మారకద్రవ్య రేట్లు, నగదు బదిలీ ఫీజులను చెల్లిస్తున్నారు. బుక్‌ మై ఫారెక్స్‌ యొక్క రెమిటెన్స్‌ పరిష్కారాలతో డిజిటల్‌ ప్రియులైన వినియోగదారులు తమ ఇళ్ల నుంచి రోజులో ఏ సమయంలో అయినా విదేశాలకు నగదు పంపించవచ్చు. వారంలో ఏడు రోజులూ, 24 గంటలూ నగదు పంపించడం మాత్రమే కాదు, గ్యారెంటీడ్‌ మరియు పారదర్శక ఫారెక్స్‌ రేట్లను సైతం వారు పొందవచ్చు. విద్య, దగ్గర బంధువుల నిర్వహణ, బహుమతులు, పలు ఇతర కార్యక్రమాల కోసం నగదును విదేశాలకు ఆర్‌బీఐ యొక్క ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ కింద బుక్‌ మై ఫారెక్స్‌ ద్వారా నాలుగు సులభమైన పద్ధతులలో సరఫరా చేయవచ్చు. ఆ పద్ధతులు ః

1. మీ అవసరాలను నిర్ధిష్టంగా వెల్లడించండి, అంటే కరెన్సీ, నగదు మొత్తం, లబ్ధిదారుని సమాచారం తదితర అంశాలు

2. మీ కేవైసీ సమర్పించండి

3. ఆన్‌లైన్‌లో చెల్లించండి

4. రేట్లు లాక్‌ చేయబడతాయి మరియు నగదు బదిలీ ప్రాసెస్‌ చేయబడుతుంది

భారతదేశంలో రెమిటెన్స్‌ మార్కెట్‌ అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతుంది. ఆర్‌బీఐ యొక్క ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద 2015 ఆర్ధిక సంవత్సరంలో ఔట్‌వార్డ్‌ రెమిటెన్స్‌లు 1.33 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2016 ఆర్ధిక సంవత్సరంలో అది 4.60 బిలియన్‌ డాలర్లుగా నిలిచింది మరియు 2020 ఆర్థిక సంవత్సరం నాటికి అది 18.76 బిలియన్‌ డాలర్లకు చేరింది. కోవిడ్‌ సంబంధిత అవరోధాల కారణంగా ఔట్‌వార్డ్‌ రెమిటెన్స్‌ల పరంగా కాస్త నెమ్మది కనిపించినా 2021 ఆర్ధిక సంవత్సరంలో ఇది 12.68 బిలియన్‌ డాలర్లుగా మారింది. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద ఔట్‌ఫ్లో 2022 ఆర్ధిక సంవత్సరంలో 19.61 బిలియన్‌ డాలర్లుగా నిలవడంతో పాటుగా 2021 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 54.6% వృద్ధి కనిపించింది.

''ఆగస్టు నెలలో అత్యధిక రెమిటెన్స్‌లు కనిపిస్తుంటాయి. ఎందుకంటే విదేశాలలో యూనివర్శిటీలు తమ నూతన సెషన్స్‌ను ఈ నెలలోనే ప్రారంభిస్తాయి. విద్యార్థులు యూనివర్సిటీ ఫీజులు, అక్కడ ఉండేందుకు అవసరమైన ఖర్చుల కోసం నగదు తీసుకుంటుంటారు. విద్య ఆధారిత నగదు బదిలీలు అత్యంత వేగంగా బుక్‌ మై ఫారెక్స్‌పై పెరుగుతున్నాయి. మా వృద్ధి పరంగా రెట్టింపు ప్రగతి సాధించగలమనే అంచనాతో ఉన్నాము.ఎందుకంటే మా రేట్లు దాదాపుగా రూపాయికి సమానంగా ఉండడం లేదా బ్యాంకులు ఏదైతే అందిస్తున్నాయో దానికి అతి తక్కువగా (యుఎస్‌డీ/ఈక్వివాలెంట్‌) ఉన్నాయి. అదనంగా, మార్కెట్‌లో డిమాండ్‌ సైతం కొవిడ్‌ అనంతర కాలంలో గణనీయంగా పెరిగింది''అని సుదర్శన్‌ మొత్వానీ, ఫౌండర్‌ అండ్‌ సీఈవొ, బుక్‌ మై ఫారెక్స్‌ డాట్‌ కామ్‌ అన్నారు.

ఈ కంపెనీ ఇప్పుడు బుక్‌ మై ఫారెక్స్‌ స్టూడెంట్‌ ఆఫర్‌ విడుదల చేసింది. దీని ద్వారా ప్రత్యేక రేట్లను అందించడంతో పాటుగా విదేశాలకు వెళ్లే విద్యార్ధులకు ప్రత్యేక ఆఫర్లనూ అందిస్తుంది. తమ ట్యూషన్‌ ఫీజులు, అంతర్జాతీయ సిమ్‌ కార్డులు, ఫారెక్స్‌ కార్డులు మొదలైన వాటిపై ప్రత్యేక రాయితీలనూ పొందవచ్చు. నగదు బదిలీలపై 5వేల రూపాయల వరకూ క్యాష్‌బ్యాక్‌ను సైతం వారు పొందవచ్చు. ఈ ఆఫర్‌ బుక్‌ మై ఫారెక్స్‌ వెబ్‌సైట్‌/యాప్‌ ద్వారా జరిగే అన్ని బుకింగ్స్‌ పై లభ్యమవుతుంది.

60 వేలకు చేరువలో సెన్సెక్స్!

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed