- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flight Crash: మరోసారి బోయింగ్ విమానాలపై అనుమానాలు
విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయే ముందు పైలట్ మేడే కాల్ పంపారు.

దిశ, బిజినెస్ బ్యూరో: విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదంగా నిలిచిన గురువారం నాటి ఎయిర్ఇండియా ప్రమాదంపై విమానాల తయారీ సంస్థ బోయింగ్ స్పందించింది. ప్రాథమిక నివేదికలను పరిశీలించామని, మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నట్టు తెలిపింది. 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా 254 మందితో లండన్‌కు వెళ్తున్న విమానం ఏఐ-171, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని మేఘనినగర్ ప్రాంతంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కూలిపోయింది. విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయే ముందు పైలట్ మేడే కాల్ పంపారు. వీటీ-ఏఎన్‌బీగా నమోదు చేసిన ఈ విమానాన్ని ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్‌తో పాటు 8,200 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పైలట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ నడిపారు.
ఎక్కువ దురానికి 787-8 డ్రీమ్‌లైనర్
అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్ రూపొందించిన వడ్‌బాడీ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలోనే ఈ ప్రమాదం జరిగింది. దీంతో మరోసారి బోయింగ్ విమానాల భద్రతకు సంబంధించి సందేహాలు నెలకొన్నాయి. ఇదివరకే పలుమార్లు బోయింగ్‌కు చెందిన డ్రీమ్‌లైనర్ మోడల్ విమానాలు సాంకేతిక సమస్య గురించి ఫిర్యాదులు అందుకుంది. అయితే, ఇంత ఘోరంగా విమానం కుప్పకూలడం ఇదే తొలిసారి కావడం విషాదం. ఈ మోడల్ ఫ్లైట్‌ను మొదటిసారి 2011లో అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణంగా ఈ వైడ్‌బాడీ విమానాలను ఎక్కువ దూరం ప్రయాణించేందుకు వినియోగిస్తారు. ఇవి నాన్-స్టాప్‌గా 13,530 కిలోమీటర్లు ప్రయానించే సామర్థ్యం కలిగి ఉంది. దీని తయారీలోనూ సగం కంటే ఎక్కువ భాగం కార్బన్ ఫైబర్‌ను వాడతారు. ఇది స్టీల్ కంటే బలంగా, అల్యూమినియం కంటే తేలిగ్గా ఉంటుంది. దీనివల్ల ఇంధన వినియోగం సమర్థవంతంగా జరుగుతుంది. పర్యావరణానికి అనుకూలంగా ఈ మోడల్ విమానం ఉంటుందనే పేరు కూడా ఉంది.
సాంకేతిక సమస్యలు
అయితే, ఈ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో అనేకసార్లు సాంకేతికత సమస్యలను ఎదుర్కొంది. ప్రధానంగా హైడ్రాలిక్ లీకేజీ, బ్యాటరీ సమస్యల వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన్న సందర్భాలు ఉన్నాయి. గతంలో సంస్థ ఇంజనీర్ ఒకరు అంతర్జాతీయ మీడియాకు ఈ మోడల్‌లోని లోపాలపై ఆరోపణలు చేశారు. దీంతో పాటు 777, 787 డ్రీమ్‌లైనర్ మోడళ్లలోనూ నాణ్యత గురించి ఫిర్యాదులున్నాయి. దీనిపై ఆ సమయంలో బోయింగ్ ఆరోపణలను ఖండించింది. తాజా ఘటనతో బోయింగ్ ఈ విమానాలపై స్పష్టమైన, ఖచ్చితమైన దర్యాప్తు చేపట్టడం ముఖ్యమనే చర్చ జరుగుతోంది.






