Hiring: టెక్, ఇ-కామర్స్ స్టార్టప్‌ల నియామకాల్లో బెంగళూరు అగ్రస్థానం

by S Gopi |

ముంబై 25 శాతం, చెన్నై 23 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Hiring: టెక్, ఇ-కామర్స్ స్టార్టప్‌ల నియామకాల్లో బెంగళూరు అగ్రస్థానం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ప్రధాన టెక్, ఇ-కామర్స్ రంగాలకు చెందిన స్టార్టప్‌లలో జరిగే నియామకాలకు సంబంధించి బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. సమీక్షించిన కాలంలో ఒక్క బెంగళూరు మాత్రమే 30 శాతంతో ముందంజలో ఉంది. ముంబై 25 శాతం, చెన్నై 23 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రముఖ స్టాఫింగ్ కంపెనీ టీమ్‌లీజ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ మూడు నగరాలు స్టార్టప్‌లకు కీలకమైన కేంద్రాలుగా మారాయి. ముఖ్యంగా టాలెంట్, ఎకోసిస్టమ్ పరంగా స్టార్టప్‌లకు అనువుగా ఉన్నాయి. మిగిలిన రంగాలతో పోలిస్తే టెక్, ఇ-కామర్స్ రంగాలు స్టార్ పెర్ఫార్మర్లుగా ఉన్నాయి. ఉద్యోగాల సృష్టిలో ఎలక్ట్రిక్ వాహనాలు(7.1 శాతం), ఆటోమోటివ్ పరిశ్రమలు(6.9 శాతం) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ రంగాల్లో 69 శాతం సంస్థలు ఏఐ ఆధారిత ఉత్పత్తిని పెంచడం, మార్కెటింగ్, ఇతర అంశాల ఆధారంగా ఎక్కువ మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్టు నివేదిక తెలిపింది. ఇతర రంగాలకు సంబంధించి తయారీ, ఇంజనీరింగ్, మౌలిక సదుపాయాల్లో నియామకాల నెమ్మదించాయి. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, బీపీఓ కంపెనీల్లో ఒత్తిడిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.

Next Story