రూ. 5 వేలలోపు ధరలో బ్లూటూత్ కాలింగ్‌ స్మార్ట్‌వాచ్‌లు

by Disha Web |
రూ. 5 వేలలోపు ధరలో బ్లూటూత్ కాలింగ్‌ స్మార్ట్‌వాచ్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంతో అట్టహాసంగా మొదలైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రేపటితో ముగయనుంది. సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఈ సేల్ 30న ముగుస్తుంది. ఈ సేల్‌లో SBI బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి చేసే కొనుగోళ్లపై 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఇంకా Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే వివిధ క్యాష్‌బ్యాక్‌లు కూడా ఉన్నాయి. ఈ సేల్‌లో బ్లూటూత్ కాలింగ్‌తో కూడిన స్మార్ట్‌వాచ్‌‌లు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలా వరకు రూ. 5,000 లోపు ధరలో ఉన్నాయి.

బ్లూటూత్ కాలింగ్‌ స్మార్ట్‌వాచ్‌లు

Noise Pulse Go Buzz Smart Watch

నాయిస్ పల్స్ గో బజ్ స్మార్ట్ వాచ్ అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో రూ. 1,799కి అందుబాటులో ఉంది. ఇది 1.69-అంగుళాల TFT డిస్‌ప్లే, 240x280 పిక్సెల్ రిజల్యూషన్‌ కలిగి ఉంది. ఆటో డిటెక్షన్ ఫీచర్‌తో 100 స్పోర్ట్స్ మోడ్‌‌లతో వస్తుంది. వాచ్ 150+ క్లౌడ్ ఆధారిత, వాచ్ ఫేస్‌లను సపోర్ట్ చేస్తుంది.


Fire-Boltt Ring 3 Bluetooth Calling Smartwatch

ఫైర్-బోల్ట్ రింగ్ 3 బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ అసలు ధర రూ. 9,999. కానీ ఈ సేల్‌లో 70% తగ్గింపుతో రూ. 2,997కే కంపెనీ ఈ స్మార్ట్‌వాచ్‌ను విక్రయిస్తుంది.1.8-అంగుళాల TFT LCD స్క్రీన్‌‌తో, 240x286 పిక్సెల్స్ రిజల్యూషన్‌ కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ 118 స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. ఇంకా హెల్త్ మానిటరింగ్‌కు సంబంధించిన ఫీచర్లను కూడా కలిగి ఉంది.Zebronics DRIP Smartwatch

Zebronics DRIP స్మార్ట్‌వాచ్ అసలు ధర కంటే 77శాతం తగ్గింపుతో రూ. 1499 కి లభిస్తుంది. ఇది 250 mAh బ్యాటరీతో వస్తుంది. హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 ట్రాకింగ్, రక్తపోటు కొలత, నిద్ర మానిటరింగ్‌ మొదలగు ఫీచర్లను కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ IP67 రేటింగ్‌తో, 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది.


Boat Wave Call Smartwatch

బోట్ వేవ్ కాల్ స్మార్ట్‌వాచ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.1,798 కు లభిస్తుంది. దీని అసలు ధర రూ. 7,990. వాచ్ 1.69-అంగుళాల HD డిస్‌ప్లేను 550 నిట్స్ గరిష్ట ప్రకాశంతో కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో, మల్టీ-స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. 150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లను కలిగి ఉంది.


Noise ColorFit Pulse Grand Smart Watch

నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్ వాచ్ రూ.1,399కి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 3,999. ఇది1.69" LCD డిస్‌ప్లే, 60 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. వాచ్ కేవలం 15 నిమిషాల ఛార్జ్‌లో25 గంటల బ్యాటరీని అందిస్తుంది. 150+ క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లు, హెల్త్ మానిటరింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ను పొందుతుంది.Next Story

Most Viewed