- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: ఇన్వెస్టర్ల సంపద రూ. 8 లక్షల కోట్లు ఆవిరి
ప్రధానంగా రియల్టీ, ఎనర్జీ, ఆటో స్టాక్‌లలో పెద్ద ఎత్తున ప్రాఫిట్ బుకింగ్ పెరగడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చూశాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొద్దిరోజులుగా స్థిరంగా ర్యాలీ అవుతున్న భారతీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. దీనికి ప్రధానంగా రియల్టీ, ఎనర్జీ, ఆటో స్టాక్‌లలో పెద్ద ఎత్తున ప్రాఫిట్ బుకింగ్ పెరగడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చూశాయి. గ్లోబల్ మార్కెట్లలో ఫెడ్ వడ్డీ రేట్ల గురించి నెలకొన్న సందేహాలు, ఇరాన్‌పై అమెరికా దాడి గురించిన ఆందోళనలు ఇన్వెస్టర్లలో భయాలను పెంచాయి. పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా సైన్యాన్ని మోహరించడమే ఇందుకు కారణం. ఇదే సమయంలో రష్యా, ఉక్రెయిన్ వ్యవహారంలో శాంతి చర్చలపై స్పష్టత లేకపోవడం, ముడి చమురు ధరలు మళ్లీ 70 డాలర్ల మార్కు చేరడం లాంటి ప్రపంచ అనిశ్చితుల మధ్య వివిధ రంగాల షేర్లలో అమ్మకాలు, ప్రాఫిట్ బుకింగ్ వల్ల కీలక బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, ఎన్ఎస్ఈ మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. దీనివల్ల ఇన్వెస్టర్లు గురువారం ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లను కోల్పోయారు. ఫలితంగా బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 464 లక్షల కోట్లకు చేరింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1236.11 పాయింట్లు పతనమై 82,498కి, నిఫ్టీ 365 పాయింట్లు పడిపోయి 25,454 వద్ద ముగిశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 91.18 వద్ద ఉంది.






