- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దలాల్ స్ట్రీట్‌లో ‘బ్లడ్ బాత్’.. 1122 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో 92.3కి పడిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) ఇవాళ ఊహించని విధంగా భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel) యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు మార్కెట్లను కుప్పకూల్చాయి. ఉదయం నుంచే నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, ఒకానొక దశలో 1,700 పాయింట్లకు పైగా పడిపోయింది. చివరకు 1122.33 పాయింట్ల నష్టంతో 79,116 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ సైతం కీలకమైన 24,500 స్థాయిని కోల్పోయింది. రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగి, చివరకు 385.95 పాయింట్ల భారీ పతనంతో 24,480 వద్ద స్థిరపడింది.
పతనానికి కారణాలివే..
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతుండటంతో ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. సరఫరాకు ఆటంకం కలుగుతుందన్న భయంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 82 డాలర్ల పైకి చేరింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో 92.3 స్థాయికి పడిపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మార్కెట్ పతనానికి ఆజ్యం పోసింది. ఈ పరిణామంతో మెటల్, బ్యాంకింగ్, ఆటో, రియల్ ఎస్టేట్ రంగాలు భారీగా నష్టపోయాయి. టాటా స్టీల్, లార్సెన్ & టూబ్రో, బజాజ్ ఫైనాన్స్ వంటి షేర్లు భారీగా నష్టపోయాయి.






