Bitcoin: అమెరికా ప్రపంచ క్రిప్టో కరెన్సీకి రాజధానిగా మారనుందా? ట్రంప్​ చేసిన ఆ పని ఇన్వెస్టర్లకు మేలు చేయనుందా?

by Vennela |

Crypto Market: అమెరికాలో వ్యూహాత్మక క్రిప్టో(Crypto Market) నిల్వలను ఏర్పాటు చేయనున్నట్లు అగ్రరాజ్యా

Bitcoin: అమెరికా ప్రపంచ క్రిప్టో కరెన్సీకి రాజధానిగా మారనుందా? ట్రంప్​ చేసిన ఆ పని ఇన్వెస్టర్లకు మేలు చేయనుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: Crypto Market: అమెరికాలో వ్యూహాత్మక క్రిప్టో(Crypto Market) నిల్వలను ఏర్పాటు చేయనున్నట్లు అగ్రరాజ్యాన్ని ప్రపంచ క్రిప్టో మార్కెట్(Crypto Market) క్యాపిటల్ గా మార్చేందుకు చేపట్టనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చేసిన ప్రకటనతో బిట్ కాయిన్(Bitcoin) సహా మరికొన్ని క్రిప్టోలు భారీ స్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి. బెంచ్ మార్క్ కాయిన్ అయిన బిట్ కాయిన్ (Bitcoin)ఏకంగా 95వేల డాలర్ల మార్క్ ను తాకింది. కాయిన్ మార్కెట్ క్యాప్ డేటా ప్రకారం ఆదివారం రాత్రి బిట్ కాయిన్(Bitcoin) ధర ఒక దశలో 95,136 డాలర్లకు చేరింది. ఆ తర్వాత 94,000 డాలర్ల దగ్గరకు చేరుకుంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ (Crypto Market) అయిన ఈథర్ ఆదివారం 13శాతం పెరిగి 2,516డాలర్లకు చేరింది.

క్రిప్టో కరెన్సీ(Crypto Market) మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.87 ట్రిలియన్ డాలర్లు కాగా మార్చి 2 ఉదయం 11.32గంటలకు మార్కెట్ వాల్యూమ్ 47 బిలియన్ డాలర్లకు దాటాయి. ట్రంప్ ప్రకటించిన వ్యూహాత్మక క్రిప్టో రిజర్వులో ఎక్స్ ఆర్ పీ, సోలానా, కార్డానో వంటి క్రిప్టో కాయిన్స్(Crypto Market) కూడా ఉన్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.55గంటల సమయానికి సొలానా కాయిన్(Solana Coin) 24శాతం పెరిగి 175.46 డాలర్లకు చేరింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.55 గంటలకు ఎక్స్ ఆర్ పీ టోకెన్ 31శాతం పెరిగి 2.92 డాలర్లకు చేరింది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఎక్స్ ఆర్ పీ టోకెన్ 33.14శాతం పెరిగి 2.84 డాలర్లకు చేరుకుందని కాయిన్ మార్కెట్ క్యాప్ డేటా(Market cap data) వెల్లడించింది.

భారత కాలమానం ప్రకారం రాత్రి 8గంటల 55 నిమిషాల సమయంలో కార్డానో టోకెన్ 1.1 డాలర్లకు వెళ్లింది. క్రితం రోజు ఇది 0.64డాలర్ల స్థాయి దగ్గర ఉండేది. అమెరికా క్రిప్టో పరిశ్రమకు ఊతమిచ్చేందుకు తమ దేశంలో క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్(Crypto Strategic Reserve) కు సంబంధించిన డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో మార్కెట్లు పుంజుకుంటున్నాయి. బైడెన్ అడ్మినిస్ట్రేషన్(Biden Administration) సంవత్సరాల అవినీతి దాడుల తర్వాత అమెరికా క్రిప్టో రిజర్వ్(Crypto Strategic Reserve) ఈ క్లిష్టమైన పరిశ్రమను పెంచుతోంది. అందుకే నా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆన్ డిజిటల్ అసెట్స్ ఎక్స్ ఆర్ పీ, ఎస్ఓఎల్, ఏడీఏతో కూడిన క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్(Crypto Strategic Reserve) పై ముందుకు సాగాలని ప్రెసిడెంట్ వర్కింగ్ గ్రూప్ ను ఆదేశించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ పోస్టులో చేశారు.

Next Story