- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bitcoin: 1,00,000 డాలర్ల మార్కు దాటిన బిట్‌కాయిన్
మన కరెన్సీ బిట్‌కాయిన్ విలువ రూ. 87 లక్షల పైనే.

దిశ, బిజినెస్ బ్యూరో: క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ తొలిసారిగా 1,00,000 డాలర్ల మార్కును దాటింది. క్రిప్టోకరెన్సీపై పెరుగుతున్న ఆసక్తికి తోడు, ఇందుకు అనుగుణంగా నియంత్రణాపరమైన విధానాలు ఊపందుకోవడంతో గిరాకీ పుంజుకుంది. మన కరెన్సీ బిట్‌కాయిన్ విలువ రూ. 87 లక్షల పైనే. ప్రధానంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నిక కావడంతో బిట్‌కాయింట్ ఒక్కసారిగా ర్యాలీ చేసింది. గడిచిన నాలుగు వారాల వ్యవధిలోనే 50 శాతానికి పైగా పెరిగింది. అదే 2024 ప్రారంభం నుంచి బిట్‌కాయిన్ విలువ రెండింతలు పెరగడం గమనార్హం. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన నిబంధనలను మారుస్తామని, ఇతర సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించడంతో బిట్‌కాయింట్ రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. దీనికితోడు బిట్‌కాయిన్ ఈ స్థాయిలో పెరిగేందుకు సంస్థాగత పెట్టుబడులు, మార్కెట్ మొమెంటం, ఇతర అంశాలు దోహదం చేశాయి. క్రిప్టోకరెన్సీకి సంబంధించి జరుగుతున్న పరిణామాలు, క్రిప్టో అనుకూల నిర్ణయాలు వీటి సంస్థాగత పాలసీలపై అంచనాలు పెరిగాయని క్రిప్టో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2025లో బిట్‌కాయిన్ ధర 1,50,000 డాలర్లకు చేరుకోవచ్చని వారు పేర్కొన్నారు.






