- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Biocon: బయోకాన్ వారసురాలిని ప్రకటించిన కిరణ్ మజుందార్
తన మేనకోడలు క్లెయిర్ మజుందార్ భవిష్యత్తులో సంస్థను నిర్వహిస్తారని తెలిపారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ బయోటెక్ సంస్థ బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా తన వారసత్వాన్ని కొనసాగించే అంశంపై స్పష్టత ఇచ్చారు. తన మేనకోడలు క్లెయిర్ మజుందార్ భవిష్యత్తులో సంస్థను నిర్వహిస్తారని తెలిపారు. అయితే తాను ఇప్పటికిప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోవట్లేదని కిరణ్ మజుందార్ స్పష్టం చేశారు. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే దశలవారీగా బాధ్యతల మార్పు జరుగుతుందని ఆమె వెల్లడించారు. ఫార్చూన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. సంస్థను ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను తన మేనకోడలు క్లెయిర్ మజుందార్‌కు అప్పగిస్తానని చెప్పారు. బయోకాన్‌ను సమర్థవంతంగా నిర్వహించే సత్తా ఆమెకుందని కిరణ్ మజుందార్ విశ్వాసం వ్యక్తం చేశారు.
1978లో బెంగళూరు కేంద్రంగా చిన్న గ్యారేజీలో ప్రారంభమైన బయోకాన్, నాలుగు దశాబ్దాల్లో భారత అగ్రశ్రేణి బయోటెక్ కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. ఈ విజయాన్ని సాధించడంలో కిరణ్ మజుందార్-షా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సంస్థ గ్లోబల్ విస్తరణ దశలోకి అడుగుపెడుతున్న సమయంలో, తదుపరి తరం నాయకత్వానికి మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం క్లైర్ మజుందార్ బికారా థెరప్యూటిక్స్ సంస్థ సీఈఓగా ఉన్నారు. ఇది ఆమె 2018లో స్థాపించిన క్యాన్సర్ థెరపీ కంపెనీ, దీనికి బయోకాన్ ఇంక్యుబేషన్ అందించింది. 2024లో నాస్‌డాక్‌లో లిస్ట్ అయింది. బైస్పెసిఫిక్ యాంటీబాడీల వంటి అభివృద్ధి చెందుతున్న థెరపీలపై దృష్టి సారించడం ద్వారా బయోటెక్ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.






