- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Billionaires: ట్రంప్ టారిఫ్ దెబ్బకు రూ. 18 లక్షల కోట్లు నష్టపోయిన బిలియనీర్లు
గడిచిన 13 ఏళ్ల కాలంలోనే అత్యధిక నష్టమని బ్లూమ్‌బర్గ్ అభిప్రాయపడింది

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల ప్రభావం వంద దేశాలపైనే కాకుండా వేల కోట్ల ఆదాయం ఉన్న సంపన్నులపైనా పడింది. రెసిప్రోకల్ టారిఫ్ కారణంగా అంతర్జాతీయ అనేక దేశాల మార్కెట్లతో పాటు అమెరికా మార్కెట్లలోనూ కుదుపులు ఏర్పడ్డాయి. దానివల్ల ప్రపంచ సంపన్నులు కూడా తమ సంపదలో భారీ నష్టాలను చూడక తప్పలేదు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ప్రపంచంలోని 500 మంది అత్యంత సంపన్నులకు టారిఫ్ ప్రభావం వల్ల 208 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 17.80 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఇది గడిచిన 13 ఏళ్ల కాలంలోనే అత్యధిక నష్టమని బ్లూమ్‌బర్గ్ అభిప్రాయపడింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ సైతం ఈ నష్టాన్ని ఎదుర్కొనక తప్పలేదు. ఇక, బిలియనీర్లు కోల్పోయిన సంపదలో అత్యధికంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మెటా వ్యవస్థాపకుడు మాక్ జుకర్‌బర్క్ 17.9 బిలియన్ డాలర్ల(రూ. 1.53 లక్షల కోట్లను కోల్పోయారు. ఈ మొత్తం మార్క్ సంపదలో 9 శాతానికి సమానం కావడం గమనార్హం. మెటా షేర్లు టారిఫ్ ప్రభావంతో 8 శాతానికి పైగా పడిపోయాయి. మార్క్ తర్వాత అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన సంపదలో 15.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.3లక్షల కోట్ల)ను కోల్పోయారు. అమెజాన్ షేర్లు 9 శాతం దెబ్బతిన్నాయి. ఇక, ఎలన్ మస్క్ సంపద కూడా 11 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.94.1 వేల కోట్లు) నష్టం ఎదుర్కొన్నారు. మిగిలిన అమెరికా బిలియనీర్లలో మైఖేల్ డెల్(9.53 బిలియన్ డాలర్లు), లారీ ఎలిసన్(8.1 బిలియన్ డాలర్లు), జెన్సన్ హువాంగ్(7.36 బిలియన్ డాలర్లు), లారీ పేజ్(4.79 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్(4.46 బిలియన్ డాలర్లు) నష్టపోయారు.






