60 వేల‌కే బైక్స్‌, 70 కిమీ మైలేజ్‌...అదిరిపోయే బైక్స్ ఇవే

by velandi.Saikiran |

హీరో అలాగే హోండా... కంపెనీలకు సంబంధించిన బైక్ ల ధరలు భారీగా తగ్గాయి. ఒక్కో బైక్ పై ఐదు నుంచి 6000 రూపాయలు తగ్గిపోయాయి.

60 వేల‌కే బైక్స్‌, 70 కిమీ మైలేజ్‌...అదిరిపోయే బైక్స్ ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు చేసిన నేపథ్యంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త అనేది. ముఖ్యంగా లక్ష రూపాయల లోపు... బైక్స్ కొనుగోలు చేసే వారికి మంచి అవకాశం దక్కింది. హీరో అలాగే హోండా... కంపెనీలకు సంబంధించిన బైక్ ల ధరలు భారీగా తగ్గాయి. ఒక్కో బైక్ పై ఐదు నుంచి 6000 రూపాయలు తగ్గిపోయాయి. గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. ఇప్పుడు ఆ జీఎస్టీ 18 శాతానికి తగ్గించింది కేంద్రం. గతంలో హీరో స్పెండర్ ప్లస్ 80,166 రూపాయలు ఉండగా ఇప్పుడు దాని ధర రూ. 73,664 కు తగ్గింది. ఇది ఎక్స్ షోరూం ధర ప్రకారమే. అంటే ఓవరాల్ గా ఈ బైక్ పైన 6400 రూపాయలు తగ్గిందని చెప్పవచ్చు.

అలాగే బడ్జెట్లో కొనుగోలు చేసే బైక్స్ లో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఒకటి. ఈ బైక్ ధర... ఇప్పుడు 60 వేల 738 రూపాయలకు తగ్గింది. దాదాపు 5500 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. 128 సీసీ ఇంజన్ ఉన్న ఈ బైకు 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ కూడా ఇస్తుంది. సామాన్యులు ఎక్కువ శాతం ఈ బైక్స్ కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే హోండాలో షైన్ 125 సీసీ బైక్ బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బైక్ పైన దాదాపు 7400 తగ్గి.. రూ. 85,590 గా ఉంది. హోండా ఎస్పి 125 బైకు ధర 8000 వరకు తగ్గి 93,247 రూపాయలకు బైక్ చేరుకుంది. TVS రైడర్ బైకులు కూడా 87 వేల రూపాయలకు చేరుకున్నాయి. వీటిపై 7700 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బైక్స్ అన్నియూ 70 కిమీ మైలేజ్ ఇస్తాయి.

Next Story