Today Gold Rate ( 29-01-2025) : గోల్డ్ ప్రియులకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు

by Phanindra |

నేడు భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చాయి.

Today Gold Rate ( 29-01-2025) : గోల్డ్  ప్రియులకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యతలను ఇస్తుంటారు. బంగారు ఆభరణాలు ధరించి అందరిలో తామే అందంగా ఉండాలని భావిస్తుంటారు. ఇక బంగారం ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు షాపుల్లో ఎగబడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక కొత్త ఏడాది లోనైనా తగ్గుతాయని మహిళలు భావించారు.

కానీ, ఈ సారి కూడా వారికి నిరాశే ఎదురైంది. అయితే నిన్న బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. నేడు భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.850 కు పెరిగి రూ.75,950 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.920 కు పెరిగి రూ.82,850 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,04,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.75,950

24 క్యారెట్ల బంగారం ధర - రూ.82,850

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.75,950

24 క్యారెట్ల బంగారం ధర – రూ.82,850

Next Story