- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today's Gold & Silver Rates: మహిళలకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యతలను ఇస్తుంటారు.

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యతలను ఇస్తుంటారు. బంగారు ఆభరణాలు ధరించి అందరిలో తామే అందంగా ఉండాలని భావిస్తుంటారు. ఇక బంగారం ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు షాపుల్లో ఎగబడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక కొత్త ఏడాది లోనైనా తగ్గుతాయని మహిళలు భావించారు.
కానీ వారికి నిరాశే ఎదురైంది. అయితే నిన్న బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. నేడు భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చాయి. నిన్నటి తో పోల్చుకుంటే.. 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.300 పెరగ్గా.. రూ. 75,550 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 330 పెరగడంతో రూ. 82,420కి విక్రయిస్తున్నారు. కిలో వెండి ధరపై ఏకంగా రూ.1000 పెరగ్గా.. రూ.1,05,000కి చేరుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
హైదరబాద్‌లో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర-రూ.75,550
24 క్యారెట్ల బంగారం ధర-రూ.82,420
విజయవాడలో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర-రూ.75,550
24 క్యారెట్ల బంగారం ధర-రూ.82,420






