Gold Rate: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. ఒక్క రోజే భారీగా పెరిగిన పసిడి ధరలు

by Prasad Jukanti |

ఒక్క రోజే పసిడి ధరలు భారీగా పెరిగాయి.

Gold Rate: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. ఒక్క రోజే భారీగా పెరిగిన పసిడి ధరలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత వారంలో వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. నిన్నటి నుంచి పసిడి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని 10 గ్రాముల పసిడి ధర రూ.56 వేలకు పతనం అవుతాయనే మార్కెట్ లో చర్చ సాగుతున్న వేళ అనూహ్యంగా నిన్నటితో పోలిస్తే ఇవాళ గోల్డ్ రేటు (Today Gold Rate) అమాంతం పెరిగి బంగారం ప్రియులకు బిగ్ షాక్ (Big shock for Gold lovers) ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ (hyderabad), విజయవాడలో (vijayawada) నిన్నటితో పోల్చుకుంటే 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధరపై రూ.2,700 పెరిగి రూ.85,600కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2940 పెరిగి రూ. 93,380 కి చేరింది. వెంటి ధర సైతం భారీగా పెరిగింది. నిన్నటితో పోల్చితే కేజీ సిల్వర్ ధర రూ.2,000 పెరిగి రూ. 1,04,000 కు చేరింది.

Next Story