- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త సంవత్సరంలో బిగ్ షాక్.. రూ. 111 పెరిగిన సిలిండర్ ధర
గత కొద్ది నెలలుగా స్థిరంగా ఉంటున్న గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు భారీగా పెంచాయి.

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది నెలలుగా స్థిరంగా ఉంటున్న గ్యాస్ సిలిండర్ ధరలను (Gas cylinder prices) ఆయిల్ కంపెనీలు భారీగా పెంచాయి. నూతన సంవత్సర వేళ వాణిజ్య గ్యాస్ సిలిండర్ (Commercial gas cylinder) ధరలు పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. నేటి నుంచి (జనవరి 1) అమల్లోకి వచ్చేలా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరను రూ. 111 పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1691.50 కి చేరుకుంది. అలాగే రాష్ట్ర రాజధాన హైదరాబాద్ నిన్నటి వరకు 1595.50కి లభించగ.. పెరిగిన ధరతో నేటి నుంచి రూ. 1706. 50 లకు ధరకు అందుబాటులో ఉంది.
కేవలం కమర్షియల్ సిలిండర్లనే కాకుండా, 5 కిలోల ఎఫ్‌టిఎల్ (FTL) సిలిండర్ల ధరను కూడా రూ. 27 పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ఇదిలా ఉంటే కొత్త సంవత్సరం వేల దేశంలోని సామాన్య ప్రజలకు ఊరటనిస్తూ 14.2 కిలోల గృహ వినియోగ (Domestic) ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మాత్రం ఆయిల్ కంపెనీలు ఎటువంటి మార్పు చేయలేదు. కాగా నూతన సంవత్సర ప్రారంభంలోనే వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులపై అదనపు భారం పడింది.






