Consumer Products: అమ్ముడుపోని స్టాక్‌పై ఎంఆర్‌పీ సవరించేందుకు కంపెనీలకు ప్రభుత్వం అనుమతి

by S Gopi |

కొత్త స్టాక్ సరఫరాకు సిద్ధమయ్యేలోపు పాత స్టాక్ ధరలను మార్చనున్నారు.

Consumer Products: అమ్ముడుపోని స్టాక్‌పై ఎంఆర్‌పీ సవరించేందుకు కంపెనీలకు ప్రభుత్వం అనుమతి
X

దిశ, బిజినెస్ బ్యూరో: జీఎస్టీ రేట్ల సవరణ కారణంగా పాత స్టాక్ విషయంలో నెలకొన్న సందేహాలపై కేంద్రం స్పష్టం ఇచ్చింది. పాత స్టాక్‌కు కొత్త వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)తో కూడిన ఎంఆర్‌పీని సవరించేందుకు కంపెనీలకు అనుమతిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల కంపెనీలతో పాటు ప్రజలకు కూడా భారీ ఉపశమనం ఇవ్వనుంది. కొత్త స్టాక్ సరఫరాకు సిద్ధమయ్యేలోపు పాత స్టాక్ ధరలను మార్చనున్నారు. దీనివల్ల పాత్ స్టాక్ కూడా తక్కువ ధరకు లభించినట్టు అవుతుంది. స్టాక్ మిగిలిపోకుండా కంపెనీలకు కూడా నష్టం జరగదు. ప్రీ-ప్యాకేజ్డ్ వస్తువుల తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులు జీఎస్టీ రేట్ల సవరణకు ముందు తయారు చేసిన లేదా దిగుమతి చేసుకున్న అమ్ముడుపోని స్టాక్‌పై సవరించిన రిటైల్ అమ్మకపు ధరలను (ఎంఆర్‌పీ) ప్రకటించాలని మంగళవారం(సెప్టెంబర్ 9న) మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే రోజువారి ప్రజలు వాడే స్టాక్ మార్కెట్లోకి వెళ్లిపోవడంతో సవరించిన జీఎస్టీ రేట్లతో ఉన్న ధరలు అమలుకు మరికొంత సమయం పడుతుంది. ఈ క్రమంలోనే అమ్ముడుపోకుండా ఉన్న స్టాక్‌కు కొత్త ఎంఆర్‌పీని మార్చుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. కొత్త ఎంఆర్‌పీని స్టిక్కర్, ఆన్‌లైన్ ప్రింటింగ్, స్టాంపింగ్ ద్వారా మార్చుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ప్యాక్‌పైన పాత ఎంఆర్‌పీ కూడా ఉండాలని స్పష్టం చేసింది. దీని గురించి పత్రకల్లో ప్రకటనలు కూడా ఇవ్వాలని, తద్వారా ప్రజలు సమాచారం తెలుస్తుందని పేర్కొంది. ఈ ఆదేశాలు స్టాక్ అయ్యే వరకు లేదా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది.

Next Story