- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు బిగ్ రిలీఫ్.. మళ్లీ బంగారం, వెండి ధరలు ఢమాల్
పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ పేద, మధ్య తరగతి కుటుంబాలకు బంగారం, వెండి ధరలు అమాంతం దిగి వస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ పేద, మధ్య తరగతి కుటుంబాలకు బంగారం (Gold), వెండి (Silver) ధరలు అమాంతం దిగి వస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ (Hyderabad Bullion Market)లో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం10 గ్రాములపై ఏకంగా రూ.5,020 తగ్గి, ప్రస్తుతం రూ. 1,54,420 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.4,600 మేర పడిపోయింది. దీంతో నేటి ధర రూ.1,41,550కు చేరింది. అదేవిధంగా బంగారంతో పాటే వెండి ధర కూడా నేలచూపులు చూసింది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే వెండి ధర భారీగా పతనమైంది. నిన్నటి ధరతో పోలిస్తే ఏకంగా రూ.20 వేలు తగ్గి, ప్రస్తుతం రూ.3 లక్షల వద్దకు చేరుకుంది.
ధరల హెచ్చుతగ్గులు..
అయితే, గత ఐదు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన ధరలు, నిన్నటి రోజున స్వల్పంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ (Doller) విలువలో మార్పుల కారణంగా ఒక్క రోజులోనే ధరలు మళ్లీ భారీగా పతనమయ్యాయి. ఈ తగ్గుదల ఇలాగే కొనసాగుతుందా లేదా మళ్లీ పుంజుకుంటుందా అనేది మార్కెట్ నిపుణుల విశ్లేషణపై ఆధారపడి ఉంటుంది.






