HDFC ఖాతాదారులకు బిగ్ గుడ్ న్యూస్

by Yella Dhawani Reddy |

దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) తన ఖాతాదారులకు బిగ్ గుడ్ న్యూస్ చెప్పింది.

HDFC ఖాతాదారులకు బిగ్ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) తన ఖాతాదారులకు బిగ్ గుడ్ న్యూస్ చెప్పింది. HDFC తన MCLR రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది. ఈ మార్పు జూలై 7, 2025 నుంచి అమలులోకి వచ్చిందని బ్యాంక్ తెలిపింది. 1 సంవత్సరం MCLR 9.10% నుంచి 8.80%కి, 6 నెలల MCLR 8.95% నుంచి 8.75%కి, 3 నెలల MCLR 8.70% నుంచి 8.65%కి, 1 నెల MCLR 8.60% నుంచి 8.55%కి తగ్గించబడింది. మొత్తం మీద 5 నుంచి 30 బేసిస్ పాయింట్ల (0.05% - 0.30%) వరకు తగ్గింపులు జరిగాయి.

ఈ తగ్గింపు వల్ల గృహ రుణాలు, ఆటో రుణాలు, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ముఖ్యంగా 1 సంవత్సరం MCLRతో అనుసంధానించిన గృహ రుణాలపై అధిక ప్రభావం కనిపించనుంది. ఫ్లోటింగ్ రేటుతో ఉన్న రుణదారుల EMI రూ.50 లక్షల రుణానికి నెలకు రూ.1500–2000 వరకు తగ్గవచ్చు. ఇది రుణగ్రాహులకు ఉపశమనం కలిగించనుంది. అయితే, రెపో రేటుతో అనుసంధానించిన రుణాలపై ఈ తగ్గింపు ప్రభావం చూపదు.

Next Story