RBI: ఫిబ్రవరి 7న ఏం జరగనుంది? నిర్మలమ్మ మరో భారీ ప్రకటన.. మిడిల్‌క్లాస్‌ ప్రజలకు దిమ్మదిరిగే న్యూస్‌ ఇది

by Vennela |

RBI: బడ్జెట్ 2025లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 12లక్షల వార్షిక ఆదాయంపై జీరో పన్నును ప్రకటించారు.

RBI: ఫిబ్రవరి 7న ఏం జరగనుంది? నిర్మలమ్మ మరో భారీ ప్రకటన.. మిడిల్‌క్లాస్‌ ప్రజలకు దిమ్మదిరిగే న్యూస్‌ ఇది
X

దిశ,వెబ్‌డెస్క్: RBI: బడ్జెట్ 2025లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 12లక్షల వార్షిక ఆదాయంపై జీరో పన్నును ప్రకటించారు. ఇది మధ్యతరగతికి పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. ఇది మధ్య తరగతికి పెద్దఉపశమనంగా చెప్పవచ్చు ఇది కాకుండా టీడీఎస్ కు సంబంధించి ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు బహుమతుల కోసం 50, 000 రూపాయల పరిమితిని కూడా లక్ష రూపాయలకు పెంచింది. అయితే ఇది ప్రారంభ ఉపశమనం మాత్రమేనని..పెద్ద ప్రకటన ఇంకా రాలేదని నిఫుణులు చెబుతున్నారు.

వాస్తవానికి ఆర్బిఐ ద్రవ్య విధాన సమావేశం ఫిబ్రవరి 5, 7 మధ్య జరగాల్సి ఉంది. అటువంటి పరిస్థితిలో వ్రుద్ధిని ప్రోత్సహించడానికి ఆర్బిఐ ఇప్పుడు పెద్ద అడుగు వేసే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండయా వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. తద్వారా మధ్య తరగతి వారు రుణ వడ్డీరేటులో కొంత ఉపశమనం పొందవచ్చు. ఈ తగ్గింపు 25బేసిస్ పాయింట్లు ఉండవచ్చు. వడ్డీరేట్లు తగ్గిస్తే వినియోగం పెరిగి ఆర్థికాభివ్రుద్ది బలపడుతుంది. కాబట్టి మధ్య తరగతి వారికి రుణమాఫీ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. వడ్డీ రేటు తగ్గుతున్నందున ఎక్కువ డబ్బు వారి చేతుల్లో ఉంటుంది. వారు బ్యాంక్ ఎఫ్డీలు, ప్రభుత్వ పథకాలు, ఇతర చోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

మోతీలాల్ ఓస్వాల్ 7శాతం జీడీపీ వ్రుద్ధిపై ఆర్బిఐ దృష్టి కేంద్రీకరిస్తుందని చైర్మన్ రామ్ దేవ్ అగర్వాల్ చెప్పారు. ఆర్బిఐ దృష్టి క్రెడిట్ స్లోను మెరుగుపరచడంపై ఉంటుంది. కాబట్టి వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం వడ్డీ రేట్లను తగ్గించవచ్చని అంచనా. ఈ బడ్జెట్ చాలా బాగుందని దీని వల్ల ప్రతి రంగం లాభపడుతుందని రామ్ దేవ్ అగర్వాల్ తెలిపారు. లిక్విడిటీని పెంచేందుకు ఆర్బిఐ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవస్థలో లిక్విడిటీని పెంచేందుకు ఆర్బిఐ రూ 60,000కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. డాలర్ రూపాయి మార్పిడి వేలం ద్వారా లిక్కిడిటీని పెంచడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. రుణవడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా ఆర్బిఐ లిక్విడిటీని పెంచుతుందని కూడా నమ్ముతుంటారు.

ఫిబ్రవరి 2023 నుంచి ఎలాంటి మార్పు లేదు. ఆర్బిఐ ఫిబ్రవరి 2023 నుంచి వడ్డీ రేట్లను మార్చలేదని గమనించవచ్చు. ఈ కాలంలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా 11 ద్రవ్య విధాన సమవేశాలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి రిలీఫ్ ఇవ్వాలని ఆర్బిఐ ఆలోచిస్తోంది. ఈ కాలంలో రెపో రేటు 6.5శాతం దగ్గర స్థిరంగా ఉంది.

Next Story