SBI ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-16 09:18:55  IST  )

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) ఖాతాదారులకు బిగ్ అలర్ట్.

SBI ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు
X

దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఈ మేరకు అన్ని కాల పరిమితుల డిపాజిట్ల (Time Limit Deposits)పై 20 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఎస్‌బీఐ (SBI) నిర్ణయం తీసుకుంది. తగ్గించిన వడ్డీ రేట్లు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, అత్యధిక వడ్డీ రేటును అందించే 444 రోజుల స్పెషల్ స్కీమ్‌కు గాను ఇప్పుడు ఏడాదికి 6.85 శాతం వడ్డీ కట్టి ఇవ్వనున్నారు. గతంలో ఇదే స్కీమ్‌కు 7.05 వడ్డీ శాతం వడ్డీ ఇచ్చేవారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 2025లో రెపో రేటును తగ్గించిన తరువాత దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన SBI రెండోసారి డిపాజిట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. RBI రెండు విడతల్లో మొత్తం 50 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించింది. రూ.3 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధికి గాను వడ్డీ రేటును 6.50 శాతానికి కుదించింది. అదేవిధంగా SBI సిబ్బందికి స్టాండర్డ్ రేటుకు 100 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ రేటు చెల్లించనున్నారు.

Next Story