- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FASTag Rule Change: వాహనదారులకు అలర్ట్ ..FASTag కొత్త రూల్స్.. తెలుసుకోకపోతే మీ జేబుకు చిల్లు
FASTag Rule Change: ఫాస్టాగ్ వినియోగిస్తున్ను వాహనదారులకు బిగ్ అలర్ట్. మీ ఫాస్టాగ్ ఓసారి చెక్ చేసుకోవడం బెటర్.

దిశ,వెబ్‌డెస్క్: FASTag Rule Change: ఫాస్టాగ్ వినియోగిస్తున్ను వాహనదారులకు బిగ్ అలర్ట్. మీ ఫాస్టాగ్ ఓసారి చెక్ చేసుకోవడం బెటర్. లేదంటే టోల్ ప్లాజ్ దగ్గరకు వెళ్లి ఇబ్బందులు పడటమే కాదు..డబుల్ ఛార్జీలు కట్టాల్సి వస్తుంది. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అవేంటో చూద్దాం.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(National Payments Corporation of India) ఫాస్టాగ్ (FASTag)బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించి రూల్స్ మార్చేసింది. ఇక మీరు చివరి నిమిషంలో రీఛార్జ్ చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ రీఛార్జ్ లెక్కలోకి రాదన్నటే. ముఖ్యంగా బ్లాక్ లిస్టులో ఉన్న ఫాస్టాగ్(FASTag) ల విషయంలో ఇబ్బందులు పడాల్సివస్తుంది. ఫాస్టాగ్ బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించి రెండు ముఖ్యమైన మార్పులను చేసింది. ఈ రెండు విషయాలను వాహనదారులు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. లేదంటే టోల్ ప్లాజా(Toll Plaza)ల దగ్గర ఎర్రర్ కోడ్ 176 చూపే పరిస్థితి నెలకుంటుంది. ఇది ఫాస్టాగ్ ద్వారా మీ టోల్ చెల్లింపులను తిరస్కరణకు దారి తీస్తుంది. ఒక్కోసారి రెండింతలు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.
ఫాస్టాగ్ బ్యాలెన్స్(FASTag balance) ధ్రువీకరణకు సంబంధించి జనవరి 28, 2025 రోజున నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఓ సర్క్యూలర్ ను జారీ చేసింది. దీని ప్రకారం రీఛార్జ్ ట్రాన్సాక్షన్లు టోల్ ప్లాజా దగ్గర రీడర్ చదివే సమయం తక్కువ బ్యాలెన్స్ లేదా బ్లాక్ లిస్ట్ కింద ట్యాగ్ ఉంచిన సమయం ఆధారంగా ధ్రువీకరించనున్నారు. రీడర్ రీడ్ టైమ్ కు 60 నిమిషాల ముందు వరకు రీడర్ రీడ్ టైమ్(Reader Read Time) తర్వాత 10 నిమిషాల వరకు యాక్టివ్ గా లేని ట్యాగ్స్ పై రీఛార్జ్ ట్రాన్సాక్షన్లు రీజన్ కోడ్ 176తో తిరస్కరిస్తారు. ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి 17, 2025 నుంచే అమల్లోకి వస్తాయి.
ఇక రెండు రకాల వెహికల్స్ ఉంటాయి. వైడ్ లిస్టెడ్ వెహికల్స్, బ్లాక్ లిస్టెడ్ వెహికల్స్ . తక్కువ బ్యాలెన్స్ ఉండటం, కేవైసీ అప్ డేట్ పెండింగ్ లో ఉండటం, వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, చాసిస్ నెంబర్ సరిపోలకపోవడం వంటి కారణాలతో బ్లాక్ లిస్టులో పెడతారు. ఫాస్టాగ్ బ్లాక్ లిస్టు(FASTag blacklist)లో పడితే వాహనదారులకు 70 నిమిషాల సమయం ఉంటుంది. వినియోగదారు టోల్ ప్లాజ్ దగ్గరకు వచ్చినప్పుడు 60నిమిషాలకు పైగా హాట్ లిస్ట్ లేదా మినహాయింపు లిస్టులో ట్యాగ్ ఉండి..వెళ్లిన తర్వాత కనీసం 10 నిమిషాల పాటు జాబితాలో ఉండిపోయినప్పుడు మాత్రమే ఫాస్టాగ్ ట్రాన్సాక్షన్ తిరస్కరిస్తుంది. లేదంటే టాన్సాక్షన్ ప్రాసెస్ అవుతుంది.
కొన్ని ఉదాహరణలతో అర్థం చేసుకుంటే..ఫాస్టాగ్(FASTag balance) ఓనర్ టీ 1 హవర్స్ పాటు బ్లాక్ లిస్టులో ఉంటే..టోల్ ప్లాజ్ దగ్గర ఫాస్టార్ రీడింగ్ కు వచ్చినప్పుడు ట్రాన్సాక్షన్ ఎర్రర్ కోడ్ 176 ద్వారా తిరస్కరణకు గురవుతుంది. అప్పుడు బ్లాక్ లిస్ట్ కారణంగా 2రెట్లు టోల్ ఫీ రికవరీ చేసే ఛాన్స్ ఉంటుంది. మరో సందర్భంలో టోల్ ప్లాజా దగ్గర వెహికల్ ఆర్ 1గంటల సమయంలో రీడ్ అయినప్పుడు బ్లాక్ లిస్టులో ఉంటే ఆర్ 1 గంటలకు 60 నిమిషాల ముందు ఆ తర్వాత 10 నిమిషాల వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ 70 నిమిషాల్లో రీఛార్జ్ చేసినట్లయితే ట్రాన్సాక్షన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఎలాంటి ఎక్సాట్రా ఛార్జీలు ఉండవు.






