NPCI: భీమ్ యాప్‌లో ‘యూపీఐ సర్కిల్ ఫుల్ డెలిగేషన్’ సదుపాయం ప్రారంభించిన ఎన్‌పీసీఐ

by S Gopi |

తమ సన్నిహితులకు రూ. 15,000 వరకు యూపీఐ చెల్లింపులు చేయడానికి అధికారం ఇచ్చే వీలుంటుంది.

NPCI: భీమ్ యాప్‌లో ‘యూపీఐ సర్కిల్ ఫుల్ డెలిగేషన్’ సదుపాయం ప్రారంభించిన ఎన్‌పీసీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కు చెందిన ఎన్‌బీఎస్‌ఎల్ సంస్థ తమ భీమ్ యాప్‌లో మంగళవారం 'యూపీఐ సర్కిల్ ఫుల్ డెలిగేషన్‌ సర్వీస్‌'ను ప్రవేశపెట్టినట్టు ప్రకటించింది. దీని ద్వారా ప్రతి వినియోగదారు తమ సన్నిహితులకు రూ. 15,000 వరకు యూపీఐ చెల్లింపులు చేయడానికి అధికారం ఇచ్చే వీలుంటుంది. ఈ సదుపాయం వారి స్వంత బ్యాంక్ ఖాతాలు ఉన్నప్పటికీ తరచుగా డిజిటల్ చెల్లింపులు చేయడానికి వెనుకాడే సీనియర్ సిటిజన్‌లకు, సురక్షితమైన, తల్లిదండ్రుల యాక్సెస్‌తో రోజువారీ ఖర్చులకు లేదంటే చదువు కోసం పిల్లలకు ఉపయోగపడనుంది. సురక్షితంగా ఇతరులకు నగదు పంపేందుకు వీలుగా ఈ కొత్త సదుపాయం ఉంటుందని ఎన్‌పీసీఐ తెలిపింది. దీనివల్ల లావాదేవీలు నియంత్రణలో ఉండటంతో పాటు సులభంగా తెలుసుకునే వీలుంటుంది. ఇది ముఖ్యంగా సొంత బ్యాంకు ఖాతా ఉన్నప్పటికీ ఆన్‌లైన్ చెల్లింపులు చేయలేని సీనియర్ సిటిజన్లు, తల్లిదండ్రుల పర్యవేక్షణలో రోజువారి ఖర్చులు చేసే పిల్లలకు ప్రయోజనకరంగా ఉండనుంది. 'యూపీఐ సర్కిల్ ఫుల్ డెలిగేషన్‌ సర్వీస్‌' ద్వారా ప్రధాన యూపీఐ యూజర్ తనకు ఇష్టమైన వ్యక్తికి తన అకౌంట్ నుంచే చెల్లింపులు చేసే అధికారం ఇవ్వడానికి వీలవుతుంది. దీన్ని గరిష్టంగా ఐదేళ్ల వరకు ఇవ్వొచ్చు.

Next Story