Bharati Enterprises: హైయర్ ఇండియాలో 49 వాటాను కొనుగోలు చేసిన భారతీ ఎంటర్‌ప్రైజెస్

by S Gopi |

భారతీ ఎంటర్‌ప్రైజెస్, ఈక్విటీ కంపెనీ వార్‌బర్గ్ పింకస్ హైయర్ ఇండియాలో 49 శాతం వాటాను సంయుక్తంగా కొనుగోలు చేశాయి

Bharati Enterprises: హైయర్ ఇండియాలో 49 వాటాను కొనుగోలు చేసిన భారతీ ఎంటర్‌ప్రైజెస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ భారతీ ఎంటర్‌ప్రైజెస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. చైనాకు చెందిన హైయర్ గ్రూప్ అనుబంధ కంపెనీ హైయర్ ఇండియాలో 49 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు బుధవారం ప్రకటనలో తెలిపింది. భారతీ ఎంటర్‌ప్రైజెస్, ఈక్విటీ కంపెనీ వార్‌బర్గ్ పింకస్ హైయర్ ఇండియాలో 49 శాతం వాటాను సంయుక్తంగా కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక వివరాలను కంపెనీలు వెల్లడించలేదు. హైయర్ ఇండియాలో 49 శాతం వాటాను హైయర్ గ్రూప్ తన వద్దే ఉంచుకుంటుంది, మిగిలిన 2 శాతం వాటాను హైయర్ ఇండియా మేనేజ్‌మెంట్ బృందం వద్ద ఉంటుంది. ప్రస్తుతం హైయర్ బ్రాండ్ కింద దేశంలో ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్, టీవీలతో పాటు పలు గృహోపకరణాలను విక్రయిస్తోంది. గత ఏడేళ్ల కాలంలో కంపెనీ ఏటా 25 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా స్థానిక వనరుల సేకరణ, ఉత్పాదక సామర్థ్యాన్ని విస్తరించడం, కొత్త ఉత్పత్తులను తీసుకురావడం, మార్కెట్ విస్తరణను వేగవంతం చేయడం ద్వారా హైయర్ ఇండియా 'మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా' లక్ష్యాలకు మద్దతు ఇస్తుందని కంపెనీ పేర్కొన్నాయి.

Next Story