- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తక్షణమే రూ.10 లక్షల లోన్.. బిజినెస్ చేయాలనుకునేవారి కోసం కేంద్రం తీసుకువచ్చిన బెస్ట్ పథకం
పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్రం తీసుకువచ్చిన మంచి పథకాల్లో ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కూడా ఒకటి. ఈ పథకం ద్వారా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి రుణాలు ఇస్తారు. ఈ పథకం ద్వారా రూ.20 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్రం తీసుకువచ్చిన మంచి పథకాల్లో ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కూడా ఒకటి. ఈ పథకం ద్వారా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి రుణాలు ఇస్తారు. ఈ పథకం ద్వారా రూ.20 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. మొదట దీని పరిమితి రూ.10 లక్షలు కాగా ఈ ఏడాది గరిష్ఠ పరిమితిని రూ.20 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ముద్రయోజనలో శిశు, కిషోర్, తరుణ్, తరుణ్ ప్లస్ అంటూ కేటగిరీలు విభజించి వాటి ఆధారంగా రుణాలు మంజూరు చేస్తారు. శిశు కేటగిరిలో రూ.50వేల వరకు రుణం ఇస్తుండగా, కిషోర్ కేటగిరిలో రూ.50 వేల నుండి రూ.5 లక్షల వరకు రుణం అందిస్తారు. అంతేకాకుండా తరుణ్ కేటగిరిలో రూ.10 లక్షల వరకు ఉచిత రుణాన్ని కల్పించనున్నారు.
తరుణ్ ప్లస్ కేటగిరిలో ఏకంగా రూ.20 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంది. ముద్ర యోజన పథకం కింద లోన్ తీసుకోవాలి అనుకుంటే దగ్గరలోని ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగ బ్యాంకులకు వెళ్లి లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఆర్బీఐ లేదా ఎన్ బీఎస్ఎఫ్ మైక్రో ఫైనాన్స్ ఆమోదం పొందిన సంస్థల ద్వారా ఈ లోన్లు మంజూరు చేస్తారు. మీరు కిరాణా దుకాణం, చిన్న హోటల్ లేదా ఇతర ఏ వ్యాపారం ప్రారంభించాలనుకున్నా ముద్ర యోజన ద్వారా లోన్ పొందవచ్చు. అంతే కాకుండా లోన్ కోసం మీరు ఎలాంటి షూరిటీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. తక్కువ వడ్డీ రేట్లకు ఈ లోన్ లభిస్తుంది. రిపేమెంట్ పీరియడ్ కూడా అనుకూలంగా ఉంటుంది. అవసరం అయితే లోన్ టెన్యూర్ 12 నెలల నుండి 5 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. అంతేకాకుండా కావాలి అనుకుంటే లోన్ ముందుగానే ఫోర్స్ క్లోజ్ చేసుకునే అకాశం కూడా ఉంది. ఇందుకోసం ఎలాంటి పెనాల్టీలు, ఫోర్స్ క్లోజ్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.






