Bengaluru Airport: వాలెంటైన్స్ సీజన్‌లో 6 కోట్ల గులాబీలను ఎగుమతి చేసిన బెంగళూరు ఎయిర్‌పోర్ట్

by S Gopi |

ఈ వాలెంటైన్స్ సీజన్‌లో ఏకంగా 2,700 టన్నుల కంటే ఎక్కువ బరువున్న 6 కోట్ల గులాబీలను ఈ ఎయిర్‌పోర్ట్ ఎగుమతి చేసింది.

Bengaluru Airport: వాలెంటైన్స్ సీజన్‌లో 6 కోట్ల గులాబీలను ఎగుమతి చేసిన బెంగళూరు ఎయిర్‌పోర్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గులాబీలు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా చాలామందికి వీటి పూల తోటల పెంపకం ద్వారా జీవనాధారంగా కూడా ఉంది. ముఖ్యంగా బెంగళూరు సమీప, గ్రామీణ ప్రాంతాల్లో గులాబీ తోటల సాగు విస్తారంగా జరుగుతుంటాయి. దీనివల్లే ప్రతి ఏటా వాలెంటైన్స్‌ రోజున గులాబీ పూల ఎగుమతులు భారీగా జరుగుతాయి. ఈ ఏడాదికి సంబంధించి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వాలెంటైన్స్ సీజన్‌లో భారీగా గులాబీలను ఎగుమతి చేసింది. అధికారిక వివరాల ప్రకారం, ఈ వాలెంటైన్స్ సీజన్‌లో ఏకంగా 2,700 టన్నుల కంటే ఎక్కువ బరువున్న 6 కోట్ల గులాబీలను ఈ ఎయిర్‌పోర్ట్ ఎగుమతి చేసింది. మొత్తం 26 దేశాలకు వాటిని ఎగుమతి చేసింది. బెంగళూరు ఇంటర్నేషన ఎయిర్‌పొర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్) నిర్వహిస్తున్న ఈ విమానాశ్రయం దేశంలోని 47 నగరాలకు కూడా గులాబీలను పంపింది. గతేడాదితో పోలిస్తే, గులాబీల సంఖ్య 38 శాతం, పరిమాణంలో 64 శాతం పెరిగింది. అంతేకాకుండా వరుసగా ఐదవ ఏట కూడా గులాబీల ఎగుమతులకు ప్రధాన గేట్‌వేగా బెంగళూరు ఎయిర్‌పోర్ట్ నిలవడం విశేషం. బెంగళూరు విమానాశ్రయంలో మెరుగైన కార్గో మౌలిక సదుపాయాలు, అధునాతన కోల్డ్ చైన్ సదుపాయాలు ఈ స్థాయి వృద్ధికి కారణమని విమానాశ్రయ అధికారులు తెలిపారు. రియల్-టైమ్ ట్రాకింగ్, టెంపరేచర్-కంట్రోల్ సిస్టమ్స్ ద్వారా నిల్వ, రవాణా సమయంలో గులాబీల తాజాదనాన్ని అందించేందుకు వీలవుతోందని వారు పేర్కొన్నారు.

Next Story